రోలెక్స్‌కు లైన్ క్లియర్
తమిళ అగ్ర హీరో సూర్య ప్రస్తుతం పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘కంగువ’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అనంతరం వెట్రిమారన్ దర్శకత్వంలో జల్లికట్టు నేపథ్య కథాంశంతో తెరకెక్కనున్న ‘వాడి వసల్' చిత్రంలో నటించబోతున్నారు.
తమిళ అగ్ర హీరో సూర్య ప్రస్తుతం పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘కంగువ’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అనంతరం వెట్రిమారన్ దర్శకత్వంలో జల్లికట్టు నేపథ్య కథాంశంతో తెరకెక్కనున్న ‘వాడి వసల్’ చిత్రంలో నటించబోతున్నారు. అయితే లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో కూడా సూర్య ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలొచ్చాయి. లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన ‘విక్రమ్’ చిత్రంలో మాఫియా డాన్ రోలెక్స్‌గా సూర్య అతిథి పాత్రకు మంచి గుర్తింపు లభించింది.
ఈ పాత్ర ఆధారంగా ఓ పూర్తి స్థాయి సినిమాకు దర్శకుడు లోకేష్ కనకరాజ్ సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఫ్యాన్స్ మీట్లో పాల్గొన్న సూర్య ‘రోలెక్స్’ చిత్రంపై క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ “లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నా. రోలెక్స్ పాత్ర ఆధారంగా చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. నా లైనప్‌లో ఈ సినిమా కూడా ఉంది’ అన్నారు. ఈ వ్యాఖ్యలతో లోకేష్ కనకరాజ్-సూర్య సినిమా విషయంలో స్పష్టత వచ్చిందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

