Suriya42 | కంగువగా సూర్య.. ఉత్కంఠ రేపుతున్న టైటిల్ టీజర్
Suriya42 Title | టాలీవుడ్లో కమల్, రజినీ తర్వాత ఆ రేంజ్లో ఫాలోయింగ్ ఉందంటే అది సూర్యకే. సూర్య సినిమాలు తమిళంలో విడుదలైతే ఎలాంటి సెలబ్రేషన్స్ జరుగుతాయే.. ఇక్కడ కూడా అదే రేంజ్లో సెలబ్రేషన్స్ జరుగుతాయి. ‘శివ పుత్రుడు’, ‘యువ’ వంటి సినిమాలతో టాలీవుడ్‌కు దగ్గరైన సూర్య.. ‘గజిని’ సినిమాతో తెలుగు బాక్సాఫీస్ దగ్గర తన సత్తా ఎంటో నిరూపించుకున్నాడు.
Suriya42 Title | టాలీవుడ్లో కమల్, రజినీ తర్వాత ఆ రేంజ్లో ఫాలోయింగ్ ఉందంటే అది సూర్యకే. సూర్య సినిమాలు తమిళంలో విడుదలైతే ఎలాంటి సెలబ్రేషన్స్ జరుగుతాయే.. ఇక్కడ కూడా అదే రేంజ్లో సెలబ్రేషన్స్ జరుగుతాయి. ‘శివ పుత్రుడు’, ‘యువ’ వంటి సినిమాలతో టాలీవుడ్‌కు దగ్గరైన సూర్య.. ‘గజిని’ సినిమాతో తెలుగు బాక్సాఫీస్ దగ్గర తన సత్తా ఎంటో నిరూపించుకున్నాడు. ఈ సినిమాతో తెలుగులో సూర్యకు తిరుగులేని క్రేజ్‌తో పాటు మంచి మార్కెట్ ఏర్పడింది. అప్పటినుంచి ఈయన నటించిన సినిమాలన్ని తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతున్నాయి. ప్రస్తుతం ఈయన మూడు సినిమాలను సెట్స్ పైన ఉంచాడు. అందులో శివ దర్శకత్వంలో చేస్తున్న పీరియాడిక్ సినిమా ఒకటి.
తాజాగా మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు. ఈ సినిమాకు ‘కంగువా ‘అనే టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో గుర్రము, గ్రద్ద, కుక్కను హైలేట్ చేస్తూ చూపించారు. గుర్రంపై సూర్య కూర్చొని స్వారికి సిద్దమైన వీరుడిలా మైనపు బొమ్మను చూపించారు. ఇక ఈ సినిమా సూర్య కెరీర్లో అత్యధిక బడ్జెట్‌తో రూపొందుంతుంది. దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను తమిళం, తెలుగులో సహా పది భాషల్లో ఈ సినిమాను 3డీలో విడుదల చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్, స్టూడీయో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సూర్యకు జోడీగ బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ నటిస్తోంది.
A Man with Power of Fire & a saga of a Mighty Valiant Hero.#Suriya42 Titled as #Kanguva In 10 Languages🔥
In Theatres Early 2024Title video 🔗: https://t.co/gACDnALtnz@KanguvaTheMovie @Suriya_offl @DishPatani @directorsiva @ThisIsDSP @StudioGreen2 @UV_Creations pic.twitter.com/5xbguzk51f
— UV Creations (@UV_Creations) April 16, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

