సినిమా థియేటర్ ను కాపాడుకోవాలి అనే కథాశంతో దర్శకుడు గంగాధర వైకె అద్వైత తెరకెక్కించిన సినిమా ‘సురభి 70ఎంఎం’. హిట్టు బొమ్మ అనేది ఉప శీర్షిక. గ్రామీణ నేపథ్యంలో రూపొందించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 18న విడుదలకు సిద్ధమవుతోంది. పల్లె వాతావరణంలో సహజమైన పాత్రలతో సినిమా సాగుతుందని, ఈ చిత్రంలో చిట్టి చిట్టి కన్నుల్లో అనే పాటను మెగాస్టార్ చిరంజీవి గారి కోసం చేశామని. ఆయనకు తెలిసి మా చిత్ర బృందాన్ని అభినందించారని దర్శకుడు తెలిపారు. ప్రేమ కథతో పాటు కుటుంబ ప్రేక్షకులకు నచ్చే అంశాలుంటాయన్నారు.