Suniel Shetty | మెంటల్ హెల్త్ యాప్‌ను ప్రారంభించిన సునీల్ శెట్టి
బాలీవుడ్ నటుడు, ఇన్వెస్టర్ సునీల్ శెట్టి (Suniel Shetty) లెట్స్ గెట్ హ్యాపీ అనే న్యూ మెంటల్ హెల్త్ యాప్‌ను లాంఛ్ చేశారు. ఈ యాప్ కోసం సునీల్ శెట్టి వేద రిహాబిలిటేషన్ వెల్నెస్ వ్యవస్ధాపక సీఈఓ మనున్ ఠాకూర్‌తో చేతులు కలిపారు.
ముంబై : బాలీవుడ్ నటుడు, ఇన్వెస్టర్ సునీల్ శెట్టి (Suniel Shetty) లెట్స్ గెట్ హ్యాపీ అనే న్యూ మెంటల్ హెల్త్ యాప్‌ను లాంఛ్ చేశారు. ఈ యాప్ కోసం సునీల్ శెట్టి వేద రిహాబిలిటేషన్ వెల్నెస్ వ్యవస్ధాపక సీఈఓ మనున్ ఠాకూర్‌తో చేతులు కలిపారు. మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఈ యాప్‌ను రియల్టేం ధెరఫీ మెడిటేషన్‌కు యాక్సెస్ చేసుకునేలా డెవలప్ చేశారు.
ఈ యాప్ యూజర్లకు మెంటల్ హెల్త్ టూల్స్, ఆన్లైన్ థెరఫీలను అందుబాటులోకి తీసుకువచ్చి వారి మానసిక ఆరోగ్యం మరింత మెరుగయ్యేందుకు బాటలు వేస్తుందని సునీల్ శెట్టి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. హ్యాపీ యాప్‌తో ప్రజలు ఎలాంటి జంకు లేకుండా మానసిక ఆరోగ్యానికి సంబంధించి నిపుణుల సూచనలు తీసుకోవచ్చని అన్నారు.
మెంటల్ హెల్త్ సపోర్ట్‌ను ప్రతి ఒక్కరికీ తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మెట్రో నగరాల్లోని యువతకు అనుకూలంగా ఈ యాప్‌ను వేద డెవలప్ చేసింది. ఈ యాప్ రోజుకు 24 గంటలూ సైకాలజిస్ట్ నుంచి థెరఫీ ఆఫర్ చేస్తుంది. మెడిటేషన్, అసెస్మెంట్ టెస్ట్స్ వంటి ఫీచర్లను కూడా యాప్‌లో పొందుపరిచారు. ఈ యాప్ ద్వారా రోజుకు 24 గంటల పాటు ఆడియా, వీడియో, చాట్ ఆప్షన్స్ ద్వారా క్వాలిఫైడ్ సైకాలజిస్టుల సేవలను వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు. పలు వెల్నెస్ టాపిక్స్‌పై కంటెంట్‌ను యాప్‌లో యాక్సెస్ చేసుకునే వీలుంది.
Read More :
Disha Patani | ర్యాంప్ వాక్‌లో సెగలు పుట్టిస్తున్న కల్కి భామ దిశా పటానీ..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

