సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేశ్ దండా నిర్మిస్తుండగా, ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. బాలాజీ గుత్తా ఈ చిత్రానికి సహ నిర్మాత. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. సందీప్ కిషన్ మంత్రదండం పట్టుకొని కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. భైరవకోనలో చోటుచేసుకునే అనూహ్య సంఘటనలు, వాటివెనకున్న రహస్యాలు ఆద్యంతం ఉత్కంఠను పంచుతాయని చిత్ర బృందం పేర్కొంది. వర్ష బొల్లమ్మ, కావ్యా థాపర్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట, సంగీతం: శేఖర్ చంద్ర, మాటలు: భాను భోగవరపు, నందు సవిరిగాన, నిర్మాత: రాజేశ్ దండా, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: వీఐ ఆనంద్.