Sunainaa | రెజినాగా వస్తున్న లాఠీ హీరోయిన్ సునయన.. టీజర్‌కు టైం ఫిక్స్
Sunainaa | నాగ్‌పూర్ భామ సునయన (Sunainaa) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం రెజినా(Regina). ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వార్త తెరపైకి వచ్చింది. ఈ మూవీ టీజర్ (Regina teaser)ను కోయంబత్తూరులోని ప్రొజొన్ మాల్లో లాంఛ్ చేయనున్నారు.
Sunainaa | లాఠీ సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులను పలుకరించింది నాగ్‌పూర్ భామ సునయన (Sunainaa). ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆడియెన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. సునయన టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం రెజినా (Regina). ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వార్త తెరపైకి వచ్చింది. ఈ మూవీ టీజర్ (Regina teaser)ను మే 30న గ్రాండ్‌గా లాంఛ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. టీజర్ లాంఛింగ్ ఈవెంట్‌ను కోయంబత్తూరులోని ప్రొజొన్ మాల్లో సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నారు.
ఈవెంట్‌కు ఐపీఎస్ తిరు వీ బాలకృష్ణన్, తిరు ఎం కృష్ణన్, డాక్టర్ జయమహేశ్ ముఖ్య అతిథులుగా రాబోతున్నారు. డెబ్యూ డైరెక్టర్ డొమిన్ డిసిల్వ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనంత్ నాగ్, నివాస్ అదితన్తోపాటు ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫీ మేల్ ఓరియెంటెడ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని యెల్లో బేర్ ప్రొడక్షన్‌పై సతీశ్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి సతీశ్ సంగీతం అందిస్తున్నాడు.
రెజినా తమిళంతోపాటు తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది. త్వరలోనే మరిన్ని వివరాలపై క్లారిటీ రానుంది. టెన్త్ క్లాస్ సినిమాతో తొలిసారి లీడ్ రోల్లో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది సునయన. ఆ తర్వాత మరో రెండు తెలుగు చిత్రాల్లో కనిపించిన సునయన.. శ్రీ విష్ణుతో కలిసి రాజ రాజ చోర చిత్రంలో మెరిసింది. ఈ మూవీ మంచి టాక్ తెచ్చుకుంది.
#Regina movie to release this coming
June 2023. Teaser on May 30th @Coimb_Prozone. Await for more@SathishNair20 @TeamRashmiVirag@sidsriram @RakenduMouliV @yellowbearprod @Shankar_Live @domin_dsilva @TheSunainaa @jungleemusicSTH @SrinivasRethika @johnsoncinepro @RithuManthra pic.twitter.com/3JEYY0XNZm— Yellow Bear Production (@yellowbearprod) May 27, 2023
Teaser coming soon! #REGINAMOVIE #REGINA @domin_dsilva @yellowbearprod #sathishnair pic.twitter.com/apNsxykaPO
— SUNAINAA (@TheSunainaa) December 14, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

