టాలీవుడ్లో ఇంట్రెస్టింగ్ కాంబో రెడీ అవుతున్నది. పానిండియా దర్శకుడు సుకుమార్, ప్రముఖ యువ నిర్మాత బన్నీ వాస్ కలిసి ప్రియదర్శి హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడెవరు? ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరు? అనే విషయాలు త్వరలో మేకర్స్ వెల్లడించనున్నారు. క్రేజీ కాంబినేషన్లో రానున్న ఈ కొత్త సినిమా.. సినీ వర్గాల్లో ప్రస్తుతం చర్చనీయాంశమైంది.