సందేశాత్మకంగా మహతి
సందీప్ మాధవ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘మహతి’. సుహాసిని మణిరత్నం, దీప్సిక కీలక పాత్రధారులు. శ్రీ పద్మిని సినిమాస్ పతాకంపై శివప్రసాద్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మంగళవారం హైదరాబాద్‌లో మొదలైంది.
సందీప్ మాధవ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘మహతి’. సుహాసిని మణిరత్నం, దీప్సిక కీలక పాత్రధారులు. శ్రీ పద్మిని సినిమాస్ పతాకంపై శివప్రసాద్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మంగళవారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి చంద్రమౌళి క్లాప్ ఇవ్వగా, పద్మ కెమెరా స్విచాన్ చేశారు. సుహాసిని మణిరత్నం స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందించగా, తొలి షాట్‌కి రాజారవీంద్ర గౌరవ దర్శకత్వం వహించారు.
సినిమా బాగా రావాలని, మంచి విజయం సాధించాలని అతిథులందరూ ఆకాంక్షించారు. టైటిల్‌కి తగ్గట్టు మహిళాప్రాధాన్యత గల కథ ఇదని, ఒక క్రైమ్ చేయడం కంటే, జరుగుతున్న క్రైమ్‌ని చూస్తూ ఊరుకోవడం అన్నిటికన్నా పెద్ద క్రైమ్ అని చెప్పే కథాంశమిదని సుహాసిని మణిరత్నం చెప్పారు.
‘దర్శక, నిర్మాత శివప్రసాద్ అద్భుతమైన కథ తయారు చేసుకున్నారు. నా పాత్రలో విభిన్నకోణాలుంటాయి. సుహాసినిగారితో పనిచేయడం ఆనందంగా ఉంది’ అని సందీప్ మాధవ్ అన్నారు. తెలుగులో తనకిది మంచి బ్రేక్ అవుతుందని దీప్సిక నమ్మకం వ్యక్తం చేసింది. కథని బలంగా నమ్మి చేస్తున్న సినిమా ఇదని దర్శకనిర్మాత శివప్రసాద్ చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌చంద్ర, కెమెరా: రాహుల్ శ్రీవాస్తవ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

