Emmy Awards: ఎమ్మీ అవార్డుల్లో సక్సెషన్ హవా.. ఈగాట్ క్లబ్లో సర్ ఎల్టన్ జాన్
Emmy Awards: డ్రామా సిరీస్ సక్సెషన్ .. ఎమ్మీ అవార్డుల్లో కీలక అవార్డులను గెలుచుకున్నది. మీడియా మొఘల్ కుటుంబ కథను ఆ సిరీస్‌లో ప్రజెంట్ చేశారు. ఇక మ్యుజిషియన్ సర్ ఎల్టన్ జాన్‌కు కూడా ఎమ్మీ అవార్డు దక్కింది. దీంతో ఈగాట్ క్లబ్లో చేరిన 19వ వ్యక్తిగా ఆయన నిలిచారు.
లాస్ ఏంజిల్స్: ఈ యేటి ఎమ్మీ అవార్డు(Emmy Awards)ల్లో సక్సెషన్, ద బియర్, బీఫ్ టీవీ సిరీస్‌లు అత్యుత్తమంగా నిలిచాయి. లాస్ ఏంజిల్స్‌లో జరిగిన అవార్డుల కార్యక్రమంలో ఈ మూడు సిరీస్‌లు కీలక అవార్డులను సొంతం చేసుకున్నాయి. సక్సెషన్లో నటించిన సారా స్నూక్, కీరన్ కల్కిన్, మాథ్యూ మాక్ఫదియన్లకు యాక్టింగ్ ప్రైజ్‌లు గెలుచుకున్నారు. ఓవరాల్ బెస్ట్ డ్రామా సిరీస్ అవార్డును కూడా సక్సెషన్ కైవసం చేసుకున్నది.
Winning looks good on these Emmy winners! 🤩#Emmys #75thEmmys #TelevisionAcademy https://t.co/HLlei6GfLc pic.twitter.com/iU2LinsuRl
— Television Academy (@TelevisionAcad) January 16, 2024
మ్యూజిక్ మాస్టర్ ఎల్టన్ జాన్‌కు ఈసారి ఎమ్మీ అవార్డు దక్కింది. ఎల్టన్ లైవ్: ఫేర్వెల్ ఫ్రమ్ డాజ్జర్ స్టేడియంకు బెస్ట్ లైవ్ వెరైటీ స్పెషల్ క్యాటగిరీలో అవార్డు దక్కింది. బ్రిటన్‌కు చెందిన ఈ సింగర్ కమ్ సాంగ్ రైటర్ ఎట్టకేలకే ఈగాట్ స్టేటస్ పొందాడు. ఎమ్మీ, గ్రామీ, ఆస్కార్, టోనీ అవార్డులు గెలిచిన 19వ వ్యక్తిగా సర్ ఎల్టన్ జాన్ నిలిచాడు. అయితే మోకాలి ఆపరేసన్ వల్ల ఆయన అవార్డు అందుకోవడానికి రాలేకపోయాడు.
Congratulations to Sir Elton John, competitive EGOT winner number 19!
Grammys 1987, 92, 95, 98, 99, 2001
Oscars 1994, 2019
Tony 2000
Emmy 2023 pic.twitter.com/FG2Rni72x1— Dave Karger (@davekarger) January 16, 2024
మీడియా మొఘల్పై తీసిన డ్రామా సిరీస్ సక్సెషన్ అద్భుతంగా ఆకట్టుకున్నది. కుటుంబ కలహాలతో సాగిన ఆ సిరీస్ నాలుగు సీజన్లు ఉర్రూతలూగించింది. ఇక ఎమ్మీ అవార్డుల్లో ఆ సిరీస్‌కు బెస్ట్ డ్రామా సిరీస్ అవార్డు దక్కింది. రైటింగ్, డెరక్షన్ విభాగాల్లోనూ ఆ సిరీస్ టాప్‌లో నిలిచింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

