జైపూర్: కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. అయితే హల్దీ సెర్మనీకి చెందిన ఫోటోలను తాజాగా ఆ జంట రిలీజ్ చేసింది. తమ ఇన్స్టాగ్రామ్లో ఆ ఫోటోలను పోస్టు చేశారు. రాజస్థాన్లోని సవాయి మాదోపూర్లో ఉన్న కోటలో అత్యంత ఘనంగా ఆ వేడుక జరిగింది. ఇక పసుపు రాసే హల్దీ సెర్మనీలో ఆ జంట ఫుల్ ఎంజాయ్ చేసింది. విక్కీ చెంపపై కత్రినా హల్దీ రాస్తున్న ఫోటోను కూడా పోస్టు చేశారు. సుక్రు, సబర్, కుషీ అంటూ తమ ఫోటోలకు ట్యాగ్ కూడా ఇచ్చారు. హల్దీ సెర్మనీకి చెందిన ఫోటోలను ఎంజాయ్ చేయండి. 2019 నుంచి ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారు. కత్రినా కైఫ్ వయసు 38 ఏళ్లు కాగా.. విక్కీ కౌశల్ 33 ఏళ్లు ఉన్నాడు.