Rakesh Master | ఇక ఆపేయండి.. యూట్యూబ్ ఛానళ్లపై రాకేశ్ మాస్టర్ కుమారుడి ఫైర్
Rakesh master | ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ (Rakesh master) ఇటీవలే కన్నుమూసిన విషయం తెలిసిందే. రాకేశ్ మాస్టర్ లేని లోటు తీర్చలేనిదంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా రాకేశ్ మాస్టర్ కుమారుడు చరణ్ (Charan) తాజాగా వార్తల్లో నిలిచాడు.
Rakesh master | ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేశ్ మాస్టర్ (Rakesh master) ఇటీవలే కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, ఫాలోవర్లు, అభిమానులు, నెటిజన్లు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడే రాకేశ్ మాస్టర్ లేని లోటు తీర్చలేనిదంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాకేశ్ మాస్టర్ కుమారుడు చరణ్ (Charan) తాజాగా వార్తల్లో నిలిచాడు. మా నాన్నకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం సోషల్ మీడియానేనని ఆవేదన వ్యక్తం చేశాడు చరణ్.
చాలా యూట్యూబ్ ఛానళ్లు మా నాన్నను బ్యాడ్ లైట్లో చూపిస్తూ స్వలాభం కోసం వినియోగించుకున్నాయి. ఇక నుంచి అలాంటి వీడియోలను వెంటనే ఆపేయండని యూట్యూబ్ ఛానళ్లను కోరాడు. రాకేశ్ మాస్టర్‌కు సంబంధించిన వీడియోలు కానీ, మా కుటుంబ విషయాలను కానీ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో ప్రసారం చేయడం ఆపేయాలని, వాటివల్ల ఇప్పటివరకు తన కుటుంబానికి జరిగిన నష్టం చాలని చరణ్ హెచ్చరించాడు.
అంతేకాదు మీ భవిష్యత్ ఎలా ఉండబోతుంది..? మీ సమస్యలు ఏంటీ..? లాంటి ప్రశ్నలను తనను అడగొద్దని చరణ్ హెచ్చరించాడు. మేం ఎలా బాధపడుతున్నామో చూపించడం ఆపేయండి. మా జీవితాలను చీకట్లోకి లాగొద్దు. ఎవరైనా మా జీవితాల్లోకి మళ్లీ రావాలనుకుంటే పోలీసులను ఆశ్రయించాల్సి వస్తుందని హెచ్చరించాడు చరణ్.
రాకేశ్ మాస్టర్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటూ.. సహచర డ్యాన్స్ మాస్టర్ల మీద తనదైన సెటైరికల్, కాంట్రవర్సియల్ కామెంట్స్‌తో ఎప్పడూ వార్తల్లో నిలుస్తుండేవాడు. డ్యాన్సర్‌గా తన కెరీర్‌ను మొదలుపెట్టిన రాకేశ్ మాస్టర్.. సుమారు 1500 సినిమాలకు పనిచేశారు. వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ఏదో ఒక వీడియోతో హాట్ టాపిక్‌గా నిలుస్తుండేవాడు రాకేశ్ మాస్టర్ .
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

