హాలీవుడ్ దర్శక దిగ్గజం స్టీవెన్ స్పీల్బర్గ్ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. వారం క్రితమే సినిమా చూశానని, అద్భుత దృశ్య కావ్యంలా ఉందని కితాబిచ్చారు. ఆస్కార్ పురస్కారాల వేడుకకు కౌంట్‌డౌన్ మొదలైన నేపథ్యంలో స్పీల్బర్గ్, రాజమౌళి వర్చువల్ విధానంలో సంభాషించారు. “ఆర్ఆర్ఆర్’ అద్భుతమైన చిత్రం. సినిమా చూస్తున్నంత సేపు నా కళ్లను నేను నమ్మలేకపోయా. విజువల్ ఫీస్ట్‌లా తెరకెక్కించారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్, అలియాభట్ యాక్టింగ్ మరో స్థాయిలో ఉంది. చిత్ర బృందానికి నా అభినందనలు’ అంటూ స్పీల్బర్గ్ ప్రశంసించారు. స్పీల్బర్గ్ దర్శకత్వం వహించిన ‘ది ఫాబెల్మాన్స్’ చిత్రం కూడా ఆస్కార్ రేసులో పోటీపడుతున్నది . ఈ చిత్ర నిర్మాణంలో రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ సహభాగస్వామిగా వ్యవహరించింది. ఈ నేపథ్యంలో రిలయన్స్ సంస..్థ రాజమౌళి, స్పీల్బర్గ్ ఆన్లైన్ భేటీని ఏర్పాటు చేసింది.