బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాల ప్రత్యేక ప్రదర్శనల నిమిత్తం అగ్ర దర్శకుడు రాజమౌళి పారిస్‌లో ఉన్నారు. అక్కడ సినిమాథెక్ ఫ్రాన్సేజ్లో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమం అనంతరం దిగ్గజ ఆస్కార్ విజేత, ఫ్రెంచ్ నిర్మాత కోస్టా గ్రావస్తో కలిసి తాను దిగిన ఫొటోను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు రాజమౌళి. ఈ అనుభవాన్ని జీవితాంతం పదిలపరచుకుంటానని ఆయన ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. తన చిత్రాలు పారిస్‌లో ప్రదర్శింపబడటమే ఒక గౌరవమని, అలాంటిది ప్రపంచ ప్రఖ్యాత చిత్ర నిర్మాతల్లో ఒకరైన కోస్టా గ్రావస్ కుటుంబంలో నేనూ భాగం అవుతానని, వారి మనసుల్లో శాశ్వత స్థానం సంపాదించుకుంటానని ఎన్నడూ ఊహించలేదని రాజమౌళి ఆనందం వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ చూసిన వారంతా ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళికి పెరుగుతున్న ఆదరణను ఈ ఫొటో ప్రతిబింబిస్తున్నదని అభిప్రాయపడుతున్నారు.