మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో ఒకటి ఆర్ఆర్ఆర్ (RRR) . మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. తాజాగా ఆర్ఆర్ఆర్ సంబంధించిన కీలక అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. డైరెక్టర్ రాజమౌళి (SS Rajamouli) మూవీ ప్రమోషన్స్ (RRR Promotions) ను షురూ చేసే ప్లాన్ సిద్దం చేశాడట. తాజా అప్ డేట్ ప్రకారం మార్చి 1 నుంచి ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నాడు జక్కన్న. ఈ చిత్రం జనవరిలోనే రిలీజ్ కావాల్సింది.
కానీ కోవిడ్ థర్డ్ రూపంలో విడుదలకు బ్రేక్ పడ్డ నేపథ్యంలో మేకర్స్ మార్చి 25న డేట్ ఫిక్స్ చేశారు. దీంతో నయా రిలీజ్ డేట్ కు అనుగుణంగా ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేసుకుంది రాజమౌళి అండ్ టీం. తెలుగులో కొన్ని పెద్ద పెద్ద ఈవెంట్స్ నిర్వహించాలని అనుకుంటుండగా..మార్చి తొలి వారంలో పూర్తి వివరాలు ప్రకటించనుంది రాజమౌళి టీం. మొత్తానికి రాబోయే రోజుల్లో వరుసగా పెద్ద సినిమాలు వస్తుండటంతో సినీ ప్రేమికులకు పెద్ద పండగనే చెప్పాలి.
ఈ చిత్రంలో రాంచరణ్ (Ramcharan) అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనుండగా..ఎన్టీఆర్ (Jr NTR) కొమ్రంభీం పాత్రలో కనిపించబోతున్నాడు. బాలీవుడ్ నటి అలియాభట్ సీత రోల్లో నటిస్తోంది. శ్రియ, అజయ్ దేవ్గన్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు.