Srivishnu interview | ఆ కిక్‌ను ఎంజాయ్చేస్తా

‘మంచి కథల్ని ఎంచుకోవడం నటుడిగా నా బాధ్యత. ఈ ప్రయత్నంలో కొన్ని సార్లు తప్పులు జరుగుతుంటాయి. ఎక్కడ పొరపాటు చేశానో స్వీయ విశ్లేషణ చేసుకుంటూ ఆ తప్పుల్ని పునరావృతం చేయకుండా జాగ్రత్తపడుతూ కెరీర్లో ముందుకు సాగుతున్నా’ అని అన్నారు శ్రీవిష్ణు. హీరోగా ఒకే ధోరణికి పరిమితం కాకుండా విభిన్నమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ ప్రతిభను చాటుకుంటున్నారాయన. శ్రీవిష్ణు హీరోగా నటించిన తాజా చిత్రం ‘రాజరాజ చోర’. హసిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకురానున్నది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో శ్రీవిష్ణు పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి…
అగ్రహీరో వెంకటేష్ సినిమాలతో ‘రాజరాజ చోర’ను పోల్చారు. ఎందుకలా?
హీరో వెంకటేష్‌గారికి నేను వీరాభిమానిని. నా సినిమాను ఆయన చిత్రాలతో పోల్చడమంటే సాహసమనే చెప్పాలి. కానీ ‘రాజరాజ చోర’ మాత్రం వెంకటేష్ సినిమాను చూస్తున్న అనుభూతిని కలిగించింది. కుటుంబమంతా కలిసి చూసే వినోదభరిత చిత్రమిది. ఈ సినిమాను అంగీకరించే ముందు వెంకటేష్‌కు కథ వినిపించాను. ట్రైలర్ చూసి నా కామెడీ టైమింగ్ బాగుందని తొలుత ఆయనే ప్రశంసించారు.
అభిమాన హీరో నుంచి ప్రశంసలు అందుకోవడం ఎలా అనిపించింది?
గతంలో వెంకటేష్‌ను కలిసే అవకాశాలు చాలా వచ్చాయి. కానీ నా అంతట నేనుగా కాకుండా ఆయనే నన్ను పిలిచే రోజు రావాలని లక్ష్యంగా పెట్టుకున్నా. నా నటనతో ఆయన్ని మెప్పించాలని ఎదురుచూశా. ‘నీది నాది ఒకే కథ’ సినిమా చూసి నన్ను అభినందించడానికి పిలిచారు. ఆ సినిమా ద్వారా ఆయన్ని కలవడం నా కెరీర్లో ఎప్పటికీ మరచిపోలేని అనుభూతిని మిగిల్చింది. కెరీర్ విషయంలో ఆయన నాకు ఎంతో విలువైన సలహాలిచ్చారు. కథల ఎంపికలో ఇప్పటికీ ఆయన అభిప్రాయాలను అడుగుతుంటా. మాస్ జోనర్ సినిమా చేయమని ఆయన ఇచ్చిన సలహాను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం కొత్త కథల్ని ఎంచుకుంటున్నా.
ఈ కథలో మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలేవి?
తెలుగు వాళ్లు వైవిధ్యమైన సినిమాలు చేయగలరని నిరూపించే చిత్రమిది. చిన్న చిన్న దొంగతనాలు చేసే యువకుడిగా నేను కనిపిస్తా. ఎప్పుడూ అబద్దాలు చెబుతూ బతికే అతడికి ఎదురైన పరిణామాలు నవ్విస్తాయి.
కొత్త దర్శకులతోనే ఎక్కువగా సినిమాలు చేస్తున్నారు?ఎందుకలా?
కొత్త దర్శకులతో సినిమా చేస్తున్నప్పుడు నాలో భయం, బాధ్యత ఉంటాయి. వారితో చేసిన సినిమా హిట్ అయినప్పుడు వచ్చే కిక్ ఎంతో ఆనందాన్నిస్తుంది. నా కెరీర్లో కొత్త దర్శకులతో చేసిన సినిమాలే పెద్ద విజయాల్ని సాధించాయి. అదే అనుభవజ్ఞులైన దర్శకులతో సినిమాలు చేసేప్పుడూ వారిపైనే పూర్తిగా భారాన్ని వేసి రిలాక్స్ అయిపోతాం. అది నాకు ఇష్టం ఉండదు.
‘గాలి సంపత్’ ఫలితం మిమ్మల్ని నిరాశపరిచిందా?
ఆ సినిమా పరాజయానికి అనేక కారణాలున్నాయి. నా పాత్రలో నిజాయితీ కనిపించలేదని చాలా మంది స్నేహితులు అన్నారు. సందేహంతోనే ఆ సినిమా చేసినట్లుగా కనిపించిందని చెప్పారు. ఆ తప్పు నాకు తెలియకుండానే జరిగింది. ప్రేక్షకుల్ని మెప్పించే మంచి సినిమా చేయాలనే దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు మాత్రం సరైన ఫలితం దక్కదు.
తదుపరి సినిమాల విశేషాలేమిటి?
అర్జున ఫాల్గుణ, భళా తందనానతో పాటు పోలీస్ జీవిత చరిత్రలో నటిస్తున్నా.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

