Sri Ranga Neethulu | యూత్ ని ఆకట్టుకునేలా ‘శ్రీరంగనీతులు’ ఫస్ట్ సింగిల్
Sriranganeethulu | యువతరం భావోద్వేగాలతో, సినిమాలోని పాత్రలతో తమను తాము ఐడెంటిఫై చేసుకునే కథలతో, సహజంగా సాగే మాటలు, మనసుకు హత్తుకునే సన్నివేశాలతో వచ్చే సినిమాలు చాలా అరుదుగా వుంటాయి. సరిగ్గా అలాంటి సినిమానే శ్రీరంగనీతులు. టాలీవుడ్ యువ నటులు సుహాస్, కార్తీక్‌రత్నం, రుహానిశర్మ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ప్రవీణ్‌కుమార్ వీఎస్ఎస్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Sriranganeethulu | యువతరం భావోద్వేగాలతో, సినిమాలోని పాత్రలతో తమను తాము ఐడెంటిఫై చేసుకునే కథలతో, సహజంగా సాగే మాటలు, మనసుకు హత్తుకునే సన్నివేశాలతో వచ్చే సినిమాలు చాలా అరుదుగా వుంటాయి. సరిగ్గా అలాంటి సినిమానే శ్రీరంగనీతులు. టాలీవుడ్ యువ నటులు సుహాస్, కార్తీక్‌రత్నం, రుహానిశర్మ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు ప్రవీణ్‌కుమార్ వీఎస్ఎస్ దర్శకత్వం వహిస్తున్నాడు. రాధావి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకటేశ్వరరావు బల్మూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ విడుదల చేయగా.. మంచి స్పందన లభించింది.
ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ సింగిల్ వినరా వినరా చెబుతా వినరా ఈ కాలం శ్రీరంగ నీతులు అనే సాంగ్‌ను విడుదల చేశారు. ఇక ఈ సాంగ్ చూస్తే.. నేటి యువత ఎదుర్కోనే పరిస్థితుల ఆధారంగా సినిమా వస్తున్నట్లు తెలుస్తుంది. శ్రీమణి సాహిత్యం అందించిన ఈ పాటకు అజయ్ అరసాడ సంగీతాన్ని అందించారు.
ఈ సినిమాపై దర్శకుడు ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ.. ఈతరం యువత వారి ఆలోచనలను, వారి ఎమోషన్స్‌ను ఏ విధంగా వుంటున్నాయి అనేది ఈ చిత్రంలో వుండే పాత్రల ద్వారా చూపిస్తున్నాం. యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న చిత్రంలో సినిమాలో వుండే ఆసక్తికరమైన కథ, కథనాలను ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే మనసుకు హత్తుకుంటాయి. కొత్తదనంతో పాటు పూర్తి కమర్షియల్ అంశాలతో రూపొందించిన చిత్రమిది అన్నారు. నిర్మాత మాట్లాడుతూ నేటి యువత ఆలోచనలు, కుటుంబ బంధాలు..ఎంటర్టైన్మెంట్ ఇలా అన్ని అంశాల కలయికతో దర్శకుడు చిత్రాన్ని అందర్ని అలరించే విధంగా తెరకెక్కించాడు. తప్పకుండా చిత్రం అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది. త్వరలోనే విడుదల తేదిని ప్రకటిస్తాం అన్నారు. ఈ చిత్రానికి డీఓపీ: టీజో టామీ, సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్, అజయ్ అరసాడ, ఎడిటింగ్: శశాంక్ ఉప్పటూరి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | అక్రమ కేసులతో బీఆర్ఎస్ గొంతుకలను అణచివేయలేరు.. బాలరాజు యాదవ్ అరెస్టుపై కేటీఆర్ ఆగ్రహం
భూపాలపల్లిలో దారుణం.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య!
Sreeja Reddy | అమెరికాలో నల్గొండ యువతి అదృశ్యం.. వాకింగ్‌కు వెళ్లి తిరిగిరాని శ్రీజా రెడ్డి!
Summer Holidays | మధురమైన బాల్యపు ప్రయాణం.. ‘సమ్మర్ హాలిడేస్’ మూవీ రివ్యూ
ఎఫ్ఎంజీ వైద్యులపై పోలీసుల ఉక్కుపాదం.. నిరసనకారులను ఈడ్చుకెళ్లి అరెస్టు!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

