Sriranganeethulu | ఈతరంను మెప్పించే యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘శ్రీరంగనీతులు’ టీజర్ విడుదల
Srirangam Neethulu | విభిన్నమైన పాత్రలతో, వైవిధ్యమైన సినిమాలతో సినిమాలు చేస్తూ వైవిధ్యమైన సినిమాలతో తమకంటూ ఓ గుర్తింపును క్రియేట్ చేసుకున్న సుహాస్, కార్తీక్‌రత్నం, రుహానిశర్మ, విరాజ్ అశ్విన్ ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం శ్రీరంగనీతులు.
Sriranganeethulu | యువతరం భావోద్వేగాలతో, సినిమాలోని పాత్రలతో తమను తాము ఐడెంటిఫై చేసుకునే కథలతో, సహజంగా సాగే మాటలు, మనసుకు హత్తుకునే సన్నివేశాలతో వచ్చే సినిమాలు చాలా అరుదుగా వుంటాయి. సరిగ్గా అలాంటి సినిమానే శ్రీరంగనీతులు. ఈ చిత్రం టీజర్ చూసిన ప్రతి ఒక్కరికి తప్పకుండా ఇదే ఫీల్ కలుగుతుంది. ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి గారి ఆహ్లాదకరమైన పాత్ర చెప్పే మాటలతో ప్రారంభమై టీజర్ ఎంతో నేచురల్‌గా అనిపించే సంభాషణలతో, సన్నివేశాలతో ఆద్యంతం ఆకట్టుకునే విధంగా కొనసాగుతుంది.
విభిన్నమైన పాత్రలతో, వైవిధ్యమైన సినిమాలతో సినిమాలు చేస్తూ వైవిధ్యమైన సినిమాలతో తమకంటూ ఓ గుర్తింపును క్రియేట్ చేసుకున్న సుహాస్, కార్తీక్‌రత్నం, రుహానిశర్మ, విరాజ్ అశ్విన్ ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం శ్రీరంగనీతులు. ప్రవీణ్‌కుమార్ వీఎస్ఎస్ దర్శకుడు. రాధావి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకటేశ్వరరావు బల్మూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలకు ఇటీవల నూతన సంవత్సరం సందర్భంగా శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్.
ఈ సందర్భంగా దర్శకుడ చిత్ర విశేషాలను తెలియజేస్తూ ఈతరం యువత వారి ఆలోచనలను, వారి ఎమోషన్స్‌ను ఏ విధంగా వుంటున్నాయి అనేది ఈ చిత్రంలో వుండే పాత్రల ద్వారా చూపిస్తున్నాం. సినిమాలో వుండే ఆసక్తికరమైన కథ, కథనాలను ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే మనసుకు హత్తుకుంటాయి. కొత్తదనంతో పాటు పూర్తి కమర్షియల్ అంశాలతో రూపొందించిన చిత్రమిది అన్నారు. నిర్మాత మాట్లాడుతూ నేటి యువత ఆలోచనలు, కుటుంబ బంధాలు.. ఎంటర్టైన్మెంట్ ఇలా అన్ని అంశాల కలయికతో దర్శకుడు చిత్రాన్ని అందర్ని అలరించే విధంగా తెరకెక్కించాడు. తప్పకుండా చిత్రం అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది అన్నారు. ఈ చిత్రానికి డీఓపీ: టీజో టామీ, సంగీతం: హర్షవర్థన్ రామేశ్వర్, అజయ్ అరసాడ, ఎడిటింగ్: శశాంక్ ఉప్పటూరి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

