Sriranganeetulu Movie | ‘శ్రీరంగనీతులు’ మూవీ రివ్యూ.. ఆడియన్స్‌ని ఆకట్టుకుందా?
SriRanga Neethulu | ప్రస్తుతం యువతరం భావోద్వేగాలతో వచ్చే సినిమాలు చాలా అరుదు. అయితే సినిమాలోని పాత్రలు తమను తాము ఐడెంటిఫై చేసుకునేలాగా తాజాగా ఒక చిత్రం వచ్చింది ఈ చిత్రమే ‘శ్రీరంగనీతులు’.
SriRanga Neethulu | ‘శ్రీరంగనీతులు’ మూవీ రివ్యూ..
సినిమా పేరు : ‘శ్రీరంగనీతులు’
తారాగణం: సుహాస్, కార్తీక్‌రత్నం, రుహానిశర్మ, విరాజ్ అశ్విన్, కార్తీక్‌రత్నం
దర్శకత్వం: ప్రవీణ్‌కుమార్ వీఎస్ఎస్
నిర్మాత: వెంకటేశ్వరరావు బల్మూరి
విడుదల : ఏప్రిల్ 11
SriRanga Neethulu | ప్రస్తుతం యువతరం భావోద్వేగాలతో వచ్చే సినిమాలు చాలా అరుదు. అయితే సినిమాలోని పాత్రలు తమను తాము ఐడెంటిఫై చేసుకునేలాగా తాజాగా ఒక చిత్రం వచ్చింది ఈ చిత్రమే ‘శ్రీరంగనీతులు’. టాలీవుడ్ యువ నటులు సుహాస్, కార్తీక్‌రత్నం, రుహానిశర్మ, విరాజ్ అశ్విన్, ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ప్రవీణ్‌కుమార్ వీఎస్ఎస్ దర్శకత్వం వహించగా.. రాధావి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై వెంకటేశ్వరరావు బల్మూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. రంజాన్ పండుగను పురస్కరించుకొని ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో.. రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
కథ : ఈ సినిమాలో ఒకేసారి ముడు స్టోరీలు రన్ అవుతుంటాయి. మొదటి కథలో శివ(సుహాస్) అంబర్‌పేట్‌లో ఉన్న ఓ చిన్న బస్తీలో సామ్ సంగ్ టెక్నీషియన్‌గా పని చేస్తుంటాడు. అయితే బస్తీలో ఉండే యూత్‌లో అందరికంటే తానే గొప్పగా ఉండాలని అనుకుంటాడు. ఈ కారణంతోనే ఆ ఏరియాలో ఉన్న ఓ రాజకీయ నాయకుడితో ఫొటోలు దిగి బతుకమ్మ పండుగ రోజు పెద్ద బ్యానర్ కట్టిస్తాడు. అయితే ఈ బ్యానర్ తెల్లవారే సరికి అక్కడ కనిపించదు. దాన్ని వేరే గ్యాంగ్ చించేస్తారు. దీంతో ఆ గ్యాంగ్‌తో గొడవ పెట్టుకుంటాడు శివ.
రెండో కథలో ఇందు(రుహాణి శర్మ), వరుణ్ (విరాజ్ అశ్విన్).. చాలా రోజులుగా ప్రేమించుకుంటారు. ఇదే విషయాన్ని తమ ఇంట్లో చెప్పడానికి ఇందు చాలా భయపడుతుంది. అదే సమయంలో ఇందుకు ఇంట్లో పెళ్లి సంబంధం ఓకే అవుతుంది. అయితే అంతలోనే ఇందుకు తాను ప్రెగ్నెంట్ అని అనుమానం వస్తుంది. దీంతో ఈ విషయాన్ని ఇంట్లో చెప్పుకోలేక.. అటు వరుణ్‌తో వెళ్లిపోలేక వీరిద్దరి మధ్య గొడవ జరుగుతుంది.
మూడో కథలో కార్తీక్(కార్తీక్ రత్నం) లైఫ్ లో సక్సెస్ అవ్వలేదని చెడు వ్యసనాలకు బానిస అవుతాడు. మందు, సిగరెట్, గంజాయికి బాగా అలవాటు పడి ఇంట్లోనే గంజాయి మొక్కలను పెంచుకుంటాడు. కార్తీక్‌ను మార్చడానికి అతడి తండ్రి ఎంతగానో ట్రై చేస్తాడు. కానీ అతడు మారడు. అయితే అనుకోకుండా ఒకరోజు కార్తీక్ రూమ్‌లోకి వచ్చిన అతడి తమ్ముడు గంజాయి మొక్కలతో సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. ఈ విషయం పోలీసుల వరకు చేరుతుంది. అయితే అతడిని పట్టుకోవడానికి పోలీసుల అతడి ఇంటికి వెళ్లగా.. పోలీసుల నుంచి తప్పించుకొని పారిపోతాడు. అయితే శివ మళ్లీ బ్యానర్ వేయించాడా?.. ఫ్లెక్సీ చించేసిన గ్యాంగ్‌ను శివ ఏం చేశాడు.? ఇందు తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పిందా? కార్తీక్ పోలీసులకు దొరికాడా? కార్తీక్ మళ్లీ మాములు మనిషిగా మారాడా లేదా అనేది తెలియాలంటే ‘శ్రీరంగనీతులు’ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ : ఈ సినిమా మూడు స్టోరీలతో ఆంథాలజీగా తెరకెక్కించారు. సినిమా చూస్తున్నంత సేపు మూడు కథలకు ఎక్కడా కన్ఫ్యూజ్ కాకుండా స్క్రీన్ ప్లే బాగా చేశారు. కామెడీతో కొన్ని చోట్ల బాగా నవ్వించేశారు. క్లైమాక్స్ చివరిలో సన్నివేశాలు చాలా నింపాదిగా సాగుతుంటాయి. ఇంకొంచెం బాగా రాసుంటే బాగుండేది అనిపించింది. మరోవైపు కార్తీక్ పాత్రకు సంబంధించి ఇంకొంచెం బెటర్‌గా చూపిస్తే బాగుండేది అని అనిపించింది. మొత్తానికి ఒక మనిషి వేరే వాళ్లతో పోల్చుకుని తనను తాను గొప్పలకు పోతాడని.. ఎప్పుడూ కూడా ఉన్నదాంతో ఇష్టపడడని.. అయితే జీవితంలో మనకి నచ్చినవి కావాలంటే దైర్యంతో ముందుకు సాగాలని.. ఆ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా అనుకున్న టార్గెట్‌ని వదిలేయకుండా ప్రయత్నించాలని ఓ మంచి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చేలా కంటెంట్ ని తీర్చిదిద్దిన తీరు ఆకట్టుకుంటుంది.
నటీనటులు: సుహాస్, కార్తీక్‌రత్నం, రుహానిశర్మ, విరాజ్ అశ్విన్‌లు ‘శ్రీరంగనీతులు’ సినిమాను సింగిల్ హ్యాండ్‌తో మోశారు అని చెప్పవచ్చు ఈ మూవీలో సుహాస్ ఓ బస్తీ కుర్రాడిగా నటించి అదరగొట్టాడు. అలాగే విరాజ్ కూడా తన పాత్రకు న్యాయం చేశాడు. రుహాణి శర్మ కూడా ఇంట్లో భయపడే అమ్మాయిలా తమ ప్రేమను ఎలా చెప్పాలో తెలియని పాత్రలో ఒదిగిపోయింది. అంతేకాకుండా కార్తీక్ రత్నం కూడా వ్యసనాలకు బానిసైన ఓ యువకుడిలా బాగా సెట్ అయ్యాడు. మిగతా నటీనటులు తమ నటనతో అదరగొట్టేశారు.
సాంకేతికంగా : ఈ సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. పాటలు మాత్రం పర్వాలేదనిపించాయి. సినిమాటోగ్రఫీ విజువల్స్ ఏ కథకు తగ్గట్టు ఆ కథకు చక్కగా కుదిరాయి. కొన్ని డైలాగ్స్ బాగున్నాయి . కామెడీ ట్రాక్ ని రియాలిటీగా రాసుకున్నారు. మనిషి మనిషిలా బతకాలి అనే ఓ మంచి పాయింట్ తో మూడు కథలను ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా ప్రేక్షకులకు చూపించడంలో దర్శకుడు ప్రవీణ్ కుమార్ సక్సెస్ అయ్యాడని.. మొత్తానికి శ్రీరంగనీతులు మూవీ అందరూ చూడదగ్గ సినిమా అని చెప్పవచ్చు.
రేటింగ్: 2.75/5
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

