సూపర్‌స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. అజయ్‌భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నెల 12న థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నాయకానాయికలు ఒకరినొకరు ఆప్యాయంగా హత్తుకొని కన్నీటి జడిలో కనిపించడం ఈ ప్రేమకథపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నది. అందమైన ప్రేమకథతో పాటు పవర్ఫుల్ యాక్షన్ అంశాలను జోడించి దర్శకుడు అజయ్‌భూపతి ఈ చిత్రాన్ని తెరకెక్కించారని, తిరుపతి నేపథ్యంలో ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్, నిర్మాణ సంస్థ: చందమామ కథలు, సమర్పణ: అశ్వినీదత్, రచన-దర్శకత్వం: అజయ్ భూపతి.