Anil Ravipudi | తెలుగు సినిమాలో నటించాలన్న కల నెరవేరింది.. అనిల్ రావిపూడికి శ్రీమాన్ ప్రత్యేక కృతజ్ఞతలు
Anil Ravipudi | తెలుగు మూలాలు కలిగి తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు శ్రీమాన్ ఎట్టకేలకు టాలీవుడ్లో అడుగుపెడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా తమిళ చిత్రాల్లో వందలాది పాత్రలు పోషించిన ఆయన, ఇప్పుడు తొలిసారి ఓ తెలుగు సినిమాలో నటించే అవకాశం రావడంతో ఆనందం వ్యక్తం చేశారు.
Anil Ravipudi | తెలుగు మూలాలు కలిగి తమిళ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు శ్రీమాన్ ఎట్టకేలకు టాలీవుడ్లో అడుగుపెడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా తమిళ చిత్రాల్లో వందలాది పాత్రలు పోషించిన ఆయన, ఇప్పుడు తొలిసారి ఓ తెలుగు సినిమాలో నటించే అవకాశం రావడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ అవకాశాన్ని కల్పించిన దర్శకుడు అనిల్ రావిపూడికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తమిళంలో నటించిన అనేక చిత్రాలు తెలుగులో డబ్ అయినప్పటికీ, శ్రీమాన్ తన పాత్రలకు స్వయంగా తెలుగు డబ్బింగ్ చెప్పుకునేవారు. తాను ఎప్పటికీ తెలుగు వ్యక్తినేనని పలుమార్లు చెప్పిన ఆయనకు, ఇంతకాలం నేరుగా తెలుగు సినిమాలో నటించే అవకాశం మాత్రం రాలేదు.
ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రంతో ఆయన టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వడం విశేషంగా మారింది. సోషల్ మీడియా వేదికగా దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి దిగిన ఫొటోలు, ఓ వీడియోను పంచుకున్న శ్రీమాన్ భావోద్వేగంగా స్పందించారు. నా మాతృభాష అయిన తెలుగులో తొలిసారి నటించడం ఎంతో ఆనందంగా ఉంది. నిజంగానే నేను తెలుగు సినిమాలో నటిస్తున్నానా అని ఒకసారి నన్ను నేనే గిచ్చుకుని చూసుకున్నాను. ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన అనిల్ రావిపూడి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేష్ మరియు నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో ఓ భారీ ఎంటర్టైనర్ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రీమాన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.ఇప్పటికే మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తయిందని వెల్లడించిన ఆయన, ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే పూర్తి స్థాయి ఎంటర్టైనర్గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్లుగా కీర్తి సురేష్, కృతి శెట్టి నటిస్తున్నారు. సంగీతాన్ని జీవీ ప్రకాష్ కుమార్ అందిస్తుండగా, షైన్ స్క్రీన్స్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

