బుల్లితెరపై తన మాటలతో పాటు అందచందాలతో ప్రేక్షకులని అలరిస్తున్న ముద్దుగుమ్మ శ్రీముఖి. ఈమె టాలెంట్ గురించి, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ విమెన్ ఆన్ టీవీ విభాగంలో టాప్ ఫైవ్ లో చోటు దక్కించుకున్న శ్రీముఖి పాపులారిటీకి ఇది నిదర్శనం. బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న శ్రీముఖి తన ఫాలోయింగ్‌ని మరింత పెంచుకుంది.
చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇటు మోడ్రన్ డ్రెస్‌లోను అటు ట్రెడిషనల్ లుక్‌లోను చాలా అందంగా ఉంటుంది. రెగ్యులర్‌గా సెక్సీ లుక్‌తో కనిపించే శ్రీముఖి అప్పుడప్పుడు మాత్రం సంప్రదాయబద్ధంగా కనిపిస్తూ ఉంటుంది.
తాజాగా ఓ టీవీ షో కోసం ఎల్లో కలర్ లంగావోణి ధరించి నడుముకు ఒద్దికైణ వడ్డాణం పెట్టింది. ఆ డ్రెస్‌లో శ్రీముఖి ఫోటో షూట్ చేయగా, ఆ పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. బుల్లితెర ద్వారా వచ్చిన ఫేమ్ తో హీరోయిన్ గా మారిన శ్రీముఖి త్వరలో క్రేజీ అంకుల్స్ సినిమాతో పలకరించబోతుంది.ఇక ఈ అమ్మడు బుల్లితెర షోలతో బిజీగా ఉంటూనే బిజినెస్ ఉమెన్ గా పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఆ మధ్య లువా పేరుతో ఓ ఫ్యాషన్ ఐటమ్స్ బ్రాండ్ స్టోర్స్ చైన్ ప్రారంభించిన విషయం తెలిసిందే.