‘ఆర్టిస్టులనుంచి ఎమోషన్స్ రాబట్టుకోవడంలో బోయపాటి దిట్ట. ఇందులో క్లాస్, మాస్ కలగలిసిన పాత్రను చేశాను. ఈ సినిమాలో కొత్త శ్రీలీలను చూస్తారు’ అన్నారు శ్రీలీల. ఆమె కథానాయికగా నటించిన ‘స్కంద’ చిత్రం నేడు విడుదలవుతున్నది. ఈ సందర్భంగా శ్రీలీల విలేకరులతో ముచ్చటించారు. ‘నా నిజజీవితానికి భిన్నంగా ఉండే పాత్రను ఇందులో చేశాను. డబ్బింగ్ చెబుతూ భలే ఎంజాయ్ చేశాను. కథరీత్యా యాక్షన్ సీన్లకు ఎంత ప్రాధాన్యత ఉందో ఎమోషన్స్‌కి కూడా ఇందులో అంతే ప్రాధాన్యత ఉంది’ అని చెప్పారు శ్రీలీల. ఇంకా మాట్లాడుతూ ‘రామ్ అంటే ఎనర్జీకి మారు పేరు.
ఆయనకు పోటీగా డ్యాన్స్ చేయటమంటే పెద్ద టాస్క్. అందుకే ఎక్కడా తగ్గకూడదని ప్రాక్టీస్ చేసి మరీ లొకేషన్‌కి వెళ్లేదాన్ని. ఇందులో మా డ్యాన్స్‌ని అందరూ ఎంజాయ్ చేస్తారు. కొత్త కొత్త ైస్టెల్స్ కూడా ట్రైచేశాం. మా ఇద్దరి కెమిస్ట్రీ ఈ సినిమాకే హైలైట్’ అన్నారు శ్రీలీల. ‘బోయపాటి మ్యాజిక్ ఈ సినిమా. ఆయన సిగ్నేచర్, ఆయన ైస్టెల్ ఆఫ్ మేకింగ్ ఈ సినిమాకు ప్రధానబలం. కచ్చితంగా హిట్ పక్కా అనుకుంటున్నా’ అని శ్రీలీల నమ్మకం వ్యక్తం చేశారు.