Spy Movie | నిఖిల్ స్పై మూవీ రిలీజ్ డేట్ లాక్..!
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌తో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ‘స్పై’ ఒకటి. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకుడిగా పరిచయమవుతూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
Spy Movie Release Date | కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు పెట్టిన పేరు యంగ్ హీరో నిఖిల్. ఆయన నుండి సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ అనే ట్యాగ్‌ను సంపాదించుకున్నాడు. ఇక ‘కార్తికేయ-2′ ఏకంగా పాన్ ఇండియా రేంజ్లో హిట్టు కొట్టి స్క్రిప్ట్ సెలక్షన్లో తను ఎంత మేటీ అనేది నిరూపించాడు. ఇక ఇటీవలే రిలీజైన ’18పేజీస్’ కాస్త నిరాశపరిచింది. అయితే నిఖిల్ ఉన్న ఫామ్‌లో ఈ ఒక్క ఫ్లాప్ తన మార్కెట్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదు. పైగా ఇది కూడా బ్రేక్ ఈవెన్ దగ్గరికి వచ్చి ఆగిపోయింది. ఇక ప్రస్తుతం నిఖిల్ చేతిలో మూడు సినిమాలున్నాయి. అందులో ‘స్పై’ ఒకటి. ప్రముఖ ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకుడిగా పరిచయమవుతూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌లుక్ పోస్టర్, గ్లింప్స్ సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాయి.
ఇక ఇదిలా ఉంటే తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన రెండు బిగ్ అప్డేట్లను ప్రకటించారు. ఈ సినిమాను జూన్ 29న పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీనితో పాటు ఈ సినిమా టీజర్‌ను మే 12న రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఈ మేరకు చిత్రబృందం ఓ వీడియోను విడుదల చేసింది. కార్తికేయ2 తర్వాత వస్తున్న మరో నేషనల్ థ్రిల్లర్ అని, స్వాతంత్రోద్యమ నేత సుభాష్ చంద్రబోస్‌కి సంబంధించిన రహస్యాన్ని ఈ సినిమాలో చూపించబోతున్నట్లు వీడియోలో తెలిపారు.
యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను ఈడి ఎంటర్టైనమెంట్స్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి, చరణ్ తేజ్ ఉప్పలపాటిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిఖిల్‌కు జోడీగా సాన్య థాకూర్, ఐశ్వర్య మీనన్‌లు నటిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్ కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.
#SPY to release on June 29. Teaser on May 12
Subhas Chandra Bose angle makes this film more interesting! 👍@actor_Nikhil pic.twitter.com/6rlyAE3ePl
— idlebrain jeevi (@idlebrainjeevi) May 6, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

