Spirit | స్పిరిట్ కోసం సందీప్ సరికొత్త స్కెచ్.. కరీనా ప్లేస్‌లో గ్లామర్ డాల్ని దింపుతున్నాడా?
Spirit | ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి ట్రెండ్ సెట్టింగ్ చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘స్పిరిట్’పై భారీ అంచనాలు ఉన్నాయి.
Spirit | ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి ట్రెండ్ సెట్టింగ్ చిత్రాలతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రస్తుతం తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘స్పిరిట్’పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి హీరోయిన్గా నటిస్తోంది. వివేక్ ఒబెరాయ్ ప్రధాన ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో కీలకమైన నెగటివ్ షేడ్స్ ఉన్న ఓ ముఖ్యమైన పాత్ర కోసం దర్శకుడు సందీప్ కాజోల్‌ను సంప్రదించినట్టు సమాచారం. మొదట ఈ పాత్రను బాలీవుడ్ స్టార్ కరీనా కపూర్ ఖాన్ చేయాల్సి ఉన్నా, కొన్ని కారణాల వల్ల ఆమె ‘స్పిరిట్’ నుంచి తప్పుకున్నారని టాక్. దాంతో ప్రత్యామ్నాయంగా కాజోల్‌ను తీసుకోవాలని చిత్రబృందం భావించినట్టు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
1992లో ‘బెఖుడి’ ద్వారా బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కాజోల్, దక్షిణాది భాషల్లో చాలా అరుదుగానే నటించింది. ధనుష్‌తో నటించిన ‘వి ఐ పి 2’ లో విలన్ పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. ఇప్పుడు ‘స్పిరిట్’ ద్వారా ఆమెకు టాలీవుడ్‌కి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. ఇక ‘స్పిరిట్’ షూటింగ్ ఇప్పటికే హైదరాబాద్‌లో ప్రారంభమైంది. కీలక సన్నివేశాల్లో ప్రభాస్ పాల్గొన్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. తన కెరీర్లో మొదటిసారిగా ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నందున అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. కొత్త లుక్, కొత్త బాడీ లాంగ్వేజ్‌తో ప్రభాస్ కనిపించబోతున్నారని సమాచారం.
గత కొన్ని నెలలుగా సౌత్ కొరియా యాక్షన్ స్టార్ డాన్ లీ (‘షాంగ్-చీ’ ఫేమ్) ‘స్పిరిట్’లో నటించబోతున్నాడనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. అభిమానులు దీనిపై క్లారిటీ కోరుతున్నా, సందీప్ రెడ్డి వంగా ఈ వార్తపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే అంతర్జాతీయ నటీనటులు ఉంటారని మాత్రం టాక్ వినిపిస్తుంది. ‘స్పిరిట్’ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరవడం పెద్ద చర్చకు దారి తీసింది. దీంతో ఆయన కూడా సినిమాలో ఒక కీలక అతిథి పాత్రలో కనిపించే అవకాశం ఉందని రూమర్స్ వస్తున్నాయి. ప్రభాస్ తండ్రి పాత్రలో చిరంజీవి నటిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నా, దీనిపై పూర్తి క్లారిటీ లేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

