Spark Movie | వరుస హత్యలు చేస్తుంది హీరోనా విలనా?.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న స్పార్క్ మూవీ ట్రైలర్..!
Spark Movie | పోస్టర్లు, టీజర్లతో ఈ మధ్య కాలంలో మంచి హైప్ తెచ్చుకున్న సినిమా స్పార్క్. విక్రాంత్ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాను డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ సంస్థ తెరకెక్కిస్తుంది. మెహరిన్, రుక్సార్ థిల్లర్ వంటి అందాలు తోడవడంతో ఈ సినిమాపై ముందు నుంచి ఆడియెన్స్‌లో మంచి బజ్ నెలకొంది.
Spark Movie | పోస్టర్లు, టీజర్లతో ఈ మధ్య కాలంలో మంచి హైప్ తెచ్చుకున్న సినిమా స్పార్క్. విక్రాంత్ హీరోగా పరిచయమవుతున్న ఈ సినిమాను డెఫ్ ఫ్రాగ్ ప్రొడక్షన్స్ సంస్థ తెరకెక్కిస్తుంది. మెహరిన్, రుక్సార్ థిల్లర్ వంటి అందాలు తోడవడంతో ఈ సినిమాపై ముందు నుంచి ఆడియెన్స్‌లో మంచి బజ్ నెలకొంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. ట్రైలర్లో స్టోరీ ఎక్కువగా రివీల్ చేయకుండా చాలా ఇంట్రెస్టింగ్గా కట్ చేశారు. వరుస హత్యలు చేస్తున్న ఓ వ్యక్తిని పట్టుకోవాలని ప్రయత్నిస్తున్న పోలీసులు. ఆ హత్యలకు హీరోకు సంబంధం ఉందని ఓ వైపు చూపిస్తూ.. హంతకుడిని పట్టుకోవడానికి హీరోను రంగంలోకి దింపినట్లు మరోవైపు చూపిస్తూ ట్రైలర్‌ను ఆసక్తికరంగా కట్ చేశారు.
లవ్ ట్రాక్‌తో మొదలైన ట్రైలర్ థ్రిల్లర్ మోడ్‌లోకి వెళ్లి సస్పెన్స్‌ను క్రియేట్ చేసింది. మరోవైపు వెన్నెల కిషోర్, కమెడియన్ సత్యలతో హిలేరియస్ కామెడీని పెట్టినట్లు ట్రైలర్లో చూపించారు. మొత్తంగా ట్రైలర్ ఒక ఫుల్ మీల్స్ ప్లేట్లా అనిపిస్తుంది. హీరోకు డెబ్యూ సినిమానే అయినా.. క్వాలిటీ విషయంలో ఏమాత్రం కంప్రమైజ్ అవ్వకుండా నిర్మాతలు సినిమా కోసం కాస్త ఎక్కువే ఖర్చు చేసినట్లు స్క్రీన్‌పై స్పష్టంగా కనిపిస్తుంది. కొన్ని విజువల్స్ అయితే హై స్టాండర్డ్స్‌లో ఉన్నాయి. ఇక ఈ సినిమాకు ఖుషీ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహద్ స్వరాలు సమకూర్చుతున్నాడు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ 17న రిలీజ్ కాబోతుంది. అంటే సలార్ రిలీజ్‌కు వారం రోజుల ముందన్న మాట. అంతేకాకుండా ఈ సినిమాకు పోటీగా అజయ్ భూపతి మంగళవారం తప్పితే పేరున్న సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కావడం లేదు. కంటెంట్ కాస్త కొత్తగా ఉంటే మట్టుకు మంచి కలెక్షన్లు కొల్లగొట్టడం ఖాయం అనిపిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

