Sonu Sood: శివ శంకర్ మాస్టర్ని కాపాడడానికి చేతనంత సాయం చేస్తానన్న సోనూసూద్

సినిమా ఇండస్ట్రీలో ఎన్నో గొప్ప పాటలకు నృత్యాలను సమకూర్చి, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన శివ శంకర్ మాస్టర్ కరోనాతో పోరాడుతున్నారు. ఆయనకు ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరం అని, ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. అయితే ఈ స్టార్ కొరియోగ్రాఫర్ ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్ ఫెక్షన్ సోకినట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం శివ శంకర్ మాస్టర్ కు వైద్యం అందిస్తుండగా, చికిత్స అందించడం కష్టమవుతోందని ఆయన చిన్న కొడుకు అజయ్ తెలిపారు.
రోజుకు లక్షల రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం ఖర్చు అవుతోందని, దయచేసి సాయం చేయాలని కోరాడు. ఈ విషయం తెలుసుకున్న రియల్ హీరో సోనూసూద్.. సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు. శివశంకర్ కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఆయన ప్రాణాలు రక్షించేందుకు అన్నివిధాలుగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడించాడు. మగధీర చిత్రంలోని ‘ధీర ధీర..’ సాంగ్ ని శివ శంకర్ మాస్టర్ కంపోజ్ చేశారు. ఈ పాటకు జాతీయ అవార్డు దక్కింది. కెరీర్ లో మొదటిసారి మగధీర సినిమాకు జాతీయ అవార్డు గెలుపొందాడు శివ శంకర్ మాస్టర్. ఇండియన్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన బాహుబలి చిత్రానికి కూడా శివశంకర్ మాస్టర్ పని చేశారు.
Iam already in touch with the family,
— sonu sood (@SonuSood) November 25, 2021
Will try my best to save his life 🙏 https://t.co/ZRdx7roPOl
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

