చెప్పులపై డిస్కౌంట్ కావాలంటే సోనూసూద్ పేరు చెప్పాలంట..!

సోనూసూద్.. ఇప్పుడు ఈ పేరు దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగాను మారు మ్రోగిపోతుంది.కరోనా కష్టకాలంలో ఎంతో మందికి తన వంతు సాయం చేసిన సోనూసూద్ ఇప్పుడు వీధి వ్యాపారులకు అండా నిలుస్తున్నారు. ఆ మధ్య రైతుని ఎక్కించుకొని బండి నడిపిన సోనూసూద్.. హైదరాబాద్‌లో జ్యూస్ స్టాల్ దగ్గర జ్యూస్ తీసి తాగాడు. ఇక ఇప్పుడు వీధి వ్యాపారి దగ్గర చెప్పులు కొని అతని దగ్గర కొనుక్కోమని అభిమానులకు కూడా చెప్పాడు.
సినిమా షూటింగ్ కోసం జమ్మూ-కశ్మీర్ వెళ్లిన సోనూసూద్… అక్కడి మార్కెట్లో తిరుగుతూ సందడి చేశాడు. షమీమ్‌ఖాన్ అనే వీధి వ్యాపారి చెంతకు వెళ్లి చెప్పులు కొన్నాడు. ఓ జత చెప్పులు తీసుకున్న సోనూసూద్…వాటి ధర ఎంత అని వ్యాపారిని అడిగాడు. రేటు చెప్పాక కొంత డిస్కౌంట్ అడిగాడు. దానికి అతను 20 శాతం ఇస్తానని పేర్కొన్నాడు.
ఆ తర్వాత ‘చెప్పులు కొనాలనుకుంటున్న వారు షమీమ్ షాపును సందర్శించండి. నా పేరు చెప్పి డిస్కౌంట్ కూడా పొందండి’ అంటూ ఓ వీడియోను తన వ్యక్తిగత ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశారు సోనూసూద్. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్న వ్యాపారులకి సపోర్ట్‌గా సోనూసూద్ చేస్తున్న కార్యక్రమాలపై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
సోనూసూద్ .. ఆచార్య చిత్రంలో ముఖ్యమైన పాత్రను పోషించిన విషయం తెలిసిందే. మ్యూజిక్ వీడియోతో సినీ లవర్స్ ను పలుకరించేందుకు రెడీ అయ్యాడు. పాటకు సంబంధించిన లుక్ విడుదల చేయగా, సోషల్ మీడియా ద్వారా మ్యూజిక్ వీడియో ఫస్ట్ అఫీషియల్ పోస్టర్ ను విడుదల చేశారు. సాంగ్ టీజర్ ఆగస్టు 5న విడుదల చేయనున్నట్టు తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

