RRR Movie | ఒలివియాకు దక్కని హెచ్‌సీఏ అవార్డు.. నిరాశలో జెన్నీ ఫ్యాన్స్
'ఆర్ఆర్ఆర్' రిలీజై ఏడాది దగ్గరకు వస్తుంది. అయినా ఇంకా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంతకంటే తెలుగు సినీ ప్రేక్షకుడికి గర్వకారణం ఏముంది. మన సినిమా ఇంగ్లీష్ సినిమాలతో పోటీపడుతుంది.
Olivia Morris | ‘ఆర్ఆర్ఆర్’ రిలీజై ఏడాది దగ్గరకు వస్తుంది. అయినా ఇంకా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇంతకంటే తెలుగు సినీ ప్రేక్షకుడికి గర్వకారణం ఏముంది. మన సినిమా ఇంగ్లీష్ సినిమాలతో పోటీపడుతుంది. అవార్డుల్లో విజయకేతనం ఎగురవేస్తుంది. కలలోనైనా చూస్తామా అనే అవార్డులు సైతం ఆర్ఆర్ఆర్కు దాసోహమవుతున్నాయి. ఇప్పటికే ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులను గెలిచిన ఆర్ఆర్ఆర్ ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచింది. దాదాపుగా ఆస్కార్ ఖాయమనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఇటీవలే ఆర్ఆర్ఆర్ బృందంలోని ముఖ్యమైన కాస్ట్ అండ్ క్రూకి ప్రముఖ హాలీవుడ్ అవార్డుల సంస్థ హెచ్‌సీఏ అవార్డులను అందజేస్తుంది. ఇప్పటికే జక్కన్న, చరణ్, కీరవాణి, సెంథిల్ కుమార్ వంటి వారు ఈ అవార్డులను అందుకోగా త్వరలో తారక్, ఆలియాభట్‌లు అందుకోకున్నారు. కాగా ఈ సినిమాలో తారక్‌కు జోడీగా ముఖ్య పాత్ర పోషించిన ఒలివియాకు మాత్రం అవార్డు ఇవ్వడంలేదని.. ఆమె ఫ్యాన్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మా జెన్నీ పాపకు అవార్డు లేదా? ఆమెకు కూడా అవార్డు ఇవ్వండి అంటూ నెటీజన్లు హెచ్‌సీఏను ట్యాగ్ చేస్తున్నారు.
ఇక ఇటీవలే ఒలివియా ఆర్ఆర్ఆర్ బృందానికి కంగ్రాట్స్ తెలిపింది. హెచ్‌సీఏ అవార్డ్స్ అందుకున్న చిత్రబృందం ఫోటోను షేర్ చేస్తూ క్లాప్స్ ఎమోజిని పెట్టింది. ఈ సినిమాలో జెన్నీ పాత్రలో ఒలివియా నటనకు ప్రేక్షకులు పరవశించి పోయారు. ఇక తారక్-ఒలివియా మధ్య వచ్చే సీన్స్ అయితే అద్భుతంగా ఉంటాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

