సోహైల్ హీరోగా శ్రీ కోనేటి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘బూట్‌కట్ బాలరాజు’. ఎం.డి.పాషా నిర్మాత. ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకురానుంది. సోమవారం ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ముఖ్యఅతిథిగా ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బ్రహ్మానందం..కష్టపడితే తప్పకుండా ఫలితం ఉంటుందని, సోహైల్ నటనలో చక్కటి పరిణితి కనబరుస్తున్నాడని ప్రశంసించారు.
సినిమా కథ చాలా కొత్తగా ఉందని మంచు మనోజ్ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘వినోదంతో పాటు హృదయాన్ని కదిలించే భావోద్వేగాలున్న చిత్రమిది. సోహైల్ ఈ కథను తన భుజాలపై మోశాడు. భీమ్స్ సంగీతం ప్రధానాకర్షణగా నిలుస్తుంది’ అన్నారు. యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే అన్ని అంశాలుంటాయని నిర్మాత ఎం.డి.పాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.