Ram Pothineni- Boyapati Srinu Movie title | నెల రోజుల కిందట మాస్ తండర్ అంటూ రిలీజైన రామ్-బోయపాటి సినిమా గ్లింప్స్ ఓ రేంజ్లో అంచనాలు పెంచేసింది. రామ్పోతినేని నెవర్ బిఫోర్ అనే విధంగా ఊరమాస్ క్యారెక్టర్లో కనిపించబోతున్నట్లు స్పష్టమయింది. ముందుగా ఆగుస్టు 11న డేట్ లాక్ చేసుకున్న ఈ సినిమా అదే రోజున భోళా శంకర్ కూడ రావడంతో కాస్త ముందుకు జరిగింది. ఈ సినిమా వినాయక చవితి వీక్ సందర్భంగా సెప్టెంబర్ 11న విడుదల కానుంది. తాజాగా రామ్ పంచుకట్టుతో ఉన్న పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ విడుదల తేదిని కన్ఫర్మ్ చేశారు.
అనుకున్న తేదీ కంటే ముందే రావడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇక ఈ సినిమా టైటిల్‌ను జూన్ 28న రివీల్ చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాకు స్కంధ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. దీనిపై క్లారిటీ రావాలంటే మరో వారం రోజులు వేచి చూడాల్సిందే. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్‌కు జోడీగా శ్రీలీల నటిస్తుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.