Skanda Movie | అప్పుడే ఓటీటీలోకి స్కంద సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Skanda Movie | ఒక్కసారి వడగండ్ల వాన ముంచెత్తినట్లు వినాయక చవితి లాంగ్ వీక్‌లో ఊహించని రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టిన స్కంద ఆ తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయింది. లాంగ్ వీక్‌ను క్యాష్ చేసుకుని హాఫ్ సెంచరీ కొట్టిన స్కంద.. ఆ తర్వాత పట్టుమని పది కోట్ల గ్రాస్ కూడా కలెక్ట్ చేయలేకపోయింది.
Skanda Movie | ఒక్కసారి వడగండ్ల వాన ముంచెత్తినట్లు వినాయక చవితి లాంగ్ వీక్‌లో ఊహించని రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టిన స్కంద ఆ తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయింది. లాంగ్ వీక్‌ను క్యాష్ చేసుకుని హాఫ్ సెంచరీ కొట్టిన స్కంద.. ఆ తర్వాత పట్టుమని పది కోట్ల గ్రాస్ కూడా కలెక్ట్ చేయలేకపోయింది. బీ, సీ సెంటర్ల ఆడియెన్స్ ఓ సారి ట్రై చేద్దాం అని చూశారే తప్ప ఫ్యామిలీ ఆడియెన్స్ చాలా మంది అటు వైపు అడుగులు కూడా వేయలేదు. ఎప్పటిలాగే ఫిజిక్స్‌కు అందని రీతిలో ఫైట్స్, మాస్ డైలాగ్స్, ఏడుపులు అన్నీ పాత చింతకాయ పచ్చడిలానే బోయపాటి ఈ సారి కూడా వడ్డించాడు.
అయితే ఇలాంటి కథతో వచ్చి హాఫ్ సెంచరీ కొట్టడం అంటే మాములు విషయం కాదు. పూర్తిగా మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసి బోయపాటి ఈ సినిమా తెరకెక్కించాడు. బోయ ఊహించినట్లుగానే మాస్ ఆడియెన్స్ నుంచి ఈ సినిమాకు ఓ రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్‌ను ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తుంది. అక్టోబర్ 27 నుంచి ఈ సినిమా డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఇన్సైడ్ టాక్. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే చాన్స్ ఉంది.
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌కు జోడీగా శ్రీలీల హీరోయిన్గా నటించింది. ఇక ఈ సినిమా సీక్వెల్ కూడా ఉండబోతుందని బోయపాటి క్లైమాక్స్‌లో క్లారిటీ ఇచ్చాడు. మరీ సినిమా రిజల్ట్ చూసి.. సీక్వెల్ ఆలోచనను పక్కన పెట్టేస్తారా.. లేదంటే తీస్తారా అనేది తెలియాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

