Skanda Movie | వామ్మో స్కంద నాన్-థియేట్రికల్ హక్కులు అన్ని కోట్లా?
Skanda Movie Business | వినాయక చవితికి నాలుగు రోజుల ముందే రిలీజవుతున్న స్కంద సినిమాపై మాస్ ఆడియెన్స్‌లో మాములు ఎక్స్పెక్టేషన్స్ లేవు. బోయపాటి వైలెన్స్ ఈ సారి ఊహించిన దానికంటే అరివీర భయంకరంగా ఉండబోతుందని గ్లింప్స్, ట్రైలర్లు గట్రా ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశాయి.
Skanda Movie Business | వినాయక చవితికి నాలుగు రోజుల ముందే రిలీజవుతున్న స్కంద సినిమాపై మాస్ ఆడియెన్స్‌లో మాములు ఎక్స్పెక్టేషన్స్ లేవు. బోయపాటి వైలెన్స్ ఈ సారి ఊహించిన దానికంటే అరివీర భయంకరంగా ఉండబోతుందని గ్లింప్స్, ట్రైలర్లు గట్రా ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశాయి. ఇక బీ, సీ సెంటర్లకు వచ్చే ప్రేక్షకుడు ఏమేమి కోరుకుంటాడో అవన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నట్లు కూడా చెప్పేశాయి. మరో రెండు వారాల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఒక్కోటి కొలిక్కి దశకు వచ్చేస్తున్నాయి. ఇక ఈ రెండు వారాల పాటు చిత్రయూనిట్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్లు జరుపనుందట. పైగా పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేస్తుండటంతో అన్నీ భాషల్లో ప్రెస్మీట్లను నిర్వహించాలని మేకర్స్ గట్టి ప్లాన్లే చేస్తున్నారట.
ఇక ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీ స్థాయిలోనే జరుగుతుందని తెలుస్తుంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం రామ్ పోతినేని కెరీర్లో హైయెస్ట్ బిజినెస్ ఇదేనట. కాగా తాజాగా ఈ సినిమా నాన్-థియేట్రికల్ హక్కులుక ఊహించని రేంజ్లో డీల్ కుదిరిందట. ఈ సినిమా అన్ని భాషల హక్కులు కలుపుకుని డిజిటల్, సాటిలైట్ హక్కులను స్టార్ సంస్థ రూ.45 కోట్లకు డీల్‌ను ఫిక్స్ చేసుకుందట. కేవలం నాన్-థియేట్రికల్ హక్కులే ఈ రేంజ్లో అమ్ముడయ్యాయంటే మాములు విషయం కాదు. ఈ డీల్‌తో సగం కంటే ఎక్కువ బడ్జెట్ రకవరీ అయినట్లు తెలుస్తుంది.
అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌కు జోడీగా శ్రీలీల నటించింది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన అన్ని పాటలు చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ఇక ఇదే రోజు ఈ సినిమాకు పోటీగా రెండు అరవ సినిమాలు చంద్రముఖి-2, మార్క్ ఆంటోనిలు రిలీజవుతున్నాయి. ఈ రెండు సినిమాలపై ఇప్పటివరకైతే ఏమంత బజ్ లేదు. ఒక వేళ మౌత్ టాక్ పాజిటీవ్‌గా వస్తే మట్టకు కలెక్షన్లపై తీవ్ర దెబ్బ పడే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shiraz Mehdi | చిన్న సినిమాలకు థియేటర్ల కొరత.. ఫిలిం ఛాంబర్ తీరుపై దర్శకుడు షిరాజ్ మెహదీ ఫైర్!
ENE Repeat | నార్త్ అమెరికాలో ‘ఈఎన్ఈ రిపీట్’ రచ్చ.. $2 మిలియన్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇస్తుందా?
Krishna Burugula | సినిమాల సంఖ్య కంటే ప్రేక్షకుల గుండెల్లో స్థానమే ముఖ్యం : ‘జిగ్రీస్’ హీరో కృష్ణ బూరుగుల!
CM Revant vs Farmers | సీఎం రేవంత్‌రెడ్డి అహంకారంపై పాడి రైతుల ఆగ్రహం.. Video
Pankaja | ఆస్కార్ బరిలో తెలుగమ్మాయిల సత్తా.. అకాడమీ రేసులోకి ‘పంకజ’ షార్ట్‌ఫిలిం!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

