Skanda Movie | స్కందలో ఆ ఒక్క ఫైట్ సీన్ కోసమే రూ.4 కోట్లు ఖర్చు చేశారా?.. అంతలా ఏముంది..!
Skanda Movie | స్కంద పని దాదాపుగా పూర్తయిపోయింది. ఒక్కసారి వడగండ్ల వాన ముంచెత్తినట్లు లాంగ్ వీక్‌లో ఊహించని రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టింది. ఆ తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయింది.
Skanda Movie | స్కంద పని దాదాపుగా పూర్తయిపోయింది. ఒక్కసారి వడగండ్ల వాన ముంచెత్తినట్లు లాంగ్ వీక్‌లో ఊహించని రేంజ్లో కలెక్షన్లు కొల్లగొట్టింది. ఆ తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయింది. లాంగ్ వీక్‌ను క్యాష్ చేసుకుని హాఫ్ సెంచరీ కొట్టిన స్కంద.. ఆ తర్వాత ఇప్పటివరకు పట్టుమని పది కోట్ల గ్రాస్ కూడా కలెక్ట్ చేయలేకపోయింది. బీ, సీ సెంటర్ల ఆడియెన్స్ ఓ సారి ట్రై చేద్దా అని చూస్తున్నారే తప్ప ఏ సెంటర్ల ఆడియెన్స్ అటు వైపు అడుగులు కూడా వేయట్లేదు. ఎప్పటిలాగే ఫిజిక్స్‌కు అందని రీతిలో ఫైట్స్, డైలాగ్స్, ఏడుపులు అన్నీ పాత చింతకాయ పచ్చడిలానే అనిపించాయి.
అయితే ఇలాంటి కథతో వచ్చి హాఫ్ సెంచరీ కొట్టడం అంటే మాములు విషయం కాదు. పూర్తిగా మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేసి బోయపాటి ఈ సినిమా తెరకెక్కించాడు. బోయ ఊహించినట్లుగానే మాస్ ఆడియెన్స్ నుంచి ఈ సినిమాకు ఓ రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ షాకింగ్‌గా అనిపిస్తుంది. ఈ సినిమాలో ఓ ఫైట్ సీన్ కోసం ఏకంగా నాలుగున్నర కోట్లు ఖర్చు చేశారట. ఈ సినిమాలో రామ్ పోతినేని ఇంట్రో హైదరాబాద్ పాత బస్తీలో జరిగే సదరు పండుగ వేడుకలో దున్నపోతులతో ఉంటుంది. ఆ పండగకు గెస్ట్‌గా వచ్చిన సీఏంపై రౌడీ మూకలు దాడి చేయడానికి ప్లాన్ చేసుకుంటారు. అందుకోసం దున్నపోతులకు ఇంజెక్షన్లు ఇచ్చి.. వాటిని అదుపు తప్పేలా చేసి.. ఆ గందరగోళంలో సీఎంను ఏసేయాలని ప్లాన్ చేసుకుంటారు.
అప్పుడే రామ్ పోతినేని మాస్ లెవల్లో ఎంట్రీ ఇచ్చి అదే దున్నపోతులతో ఆ రౌడీ మూకలను మట్టి కరపిస్తాడు. నిజానికిది కొత్త ప్రయోగమే. బర్రెలతో ఫైట్‌ను ప్లాన్ చేయడం బాగానే ఉంది కానీ.. మరీ ఆ ఒక్క సీన్ కోసం నాలుగున్నర కోట్లు ఖర్చు పెట్టారంటేనే విడ్డూరంగా అనిపిస్తుంది. కేవలం ఆ దున్నపోతుల కోసమే లక్షలు ఖర్చు పెట్టారట. ఈ విషయాన్ని స్వయంగా బోయపాటే చెప్పడం విశేషం. సినిమా చూసిన వారు మరీ నాలుగు కోట్ల వర్త్ ఉన్న ఫైట్ అయితే కాదని కామెంట్స్ చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

