Mark Antony | విశాల్ మార్క్ ఆంటోనీ కోసం ఎస్జే సూర్య డెడికేషన్‌కు హ్యాట్సాఫ్..!
Mark Antony | విశాల్ (Vishal) టైటిల్ రోల్లో, ఎస్జే సూర్య (SJ Suryah) మరో లీడ్ రోల్లో వస్తున్న మూవీ మార్క్ ఆంటోనీ (Mark Antony). సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది టీం.
Mark Antony| విశాల్ (Vishal) టైటిల్ రోల్లో వస్తున్న మూవీ మార్క్ ఆంటోనీ (Mark Antony). ఎస్జే సూర్య (SJ Suryah) మరో లీడ్ రోల్లో నటిస్తున్నాడు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో సెల్వ రాఘవన్, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్క్ ఆంటోనీ సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది టీం.
ఎస్జే సూర్య కెరీర్లో గొప్ప అఛీవ్మెంట్ ఒకటి జరిగింది. మార్క్ ఆంటోనీ సినిమాకు ఎస్జే సూర్య కేవలం ఒక్క రోజులోనే డబ్బింగ్ పూర్తి చేశాడట. తాజా అప్డేట్ ప్రకారం 22 గంటల్లో తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేశాడు. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ డెడికేషన్, కమిట్మెంట్కు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఎస్జే సూర్య పాత్ర పక్కా వినోదాన్ని అందించబోతున్నట్టు టీజర్, ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చేశాడు డైరెక్టర్.ఈ చిత్రం ఎస్జే సూర్య కెరీర్లో మైల్ స్టోన్ సినిమాగా నిలవడం ఖాయమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
మార్క్ ఆంటోనీలో పెళ్లి చూపులు ఫేం రీతూవర్మ (Ritu Varma) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. మార్క్ ఆంటోనీ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇప్పటికే విడుదల చేసిన మార్క్ ఆంటోనీ ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందిస్తున్నాడు. వైజీ మహేంద్రన్, అభినయ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
మార్క్ ఆంటోనీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన I Love U Ne సాంగ్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని మినీ స్టూడియో బ్యానర్‌పై వినోద్ కుమార్ తెరకెక్కిస్తున్నారు. విశాల్ మరోవైపు హోంబ్యానర్ విశాల్ ఫిలిం ఫ్యాక్టరీపై స్వీయ దర్శకత్వంలో డిటెక్టివ్ ఫిల్మ్ తుప్పరివాలన్ 2 చేస్తున్నాడు. దీంతోపాటు విశాల్ 34కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
మార్క్ ఆంటోనీ మోషన్ పోస్టర్..
మార్క్ ఆంటోనీ ట్రైలర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

