SK21 | తెలుగు, తమిళ ప్రేక్షకులకు ఇంట్రడక్షన్ అవసరం లేని నటుడు శివకార్తికేయన్ (Sivakarthikeyan). బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న ఈ టాలెంటెడ్ హీరో ప్రస్తుతం రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడని తెలిసిందే. SK21గా వస్తున్న ఈ మూవీలో సాయిపల్లవి హీరోయిన్గా నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి స్టిల్ రూపంలో నెట్టింట చక్కర్లు కొడుతోంది.
ఎస్కే 21లో శివకార్తికేయన్ ఇదివరకెన్నడూ కనిపించని లుక్‌లో కనిపించబోతున్నాడు. తాజాగా 75రోజులపాటు జరిగిన లాంగ్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. సినిమా కోసం గైడ్ చేసిన రియల్ హీరోలు ఇండియన్ మిలటరీ జవాన్లకు ధన్యవాదాలు తెలియజేశారు మేకర్స్. రంగులు చల్లుకుంటూ డిఫరెంట్ హెయిర్‌స్టైల్‌లో స్టైలిష్ గాగుల్స్ పెట్టుకున్న స్టిల్ నెట్టింట వైరల్ అవుతోంది. ఎస్కే 21నెక్ట్స్ షెడ్యూల్ త్వరలోనే చెన్నైలో షురూ కానుంది. మరి ఈ సారి ఎలాంటి స్టోరీతో ఆడియెన్స్ ముందుకొస్తున్నాడనేది మాత్రం సస్పెన్స్‌లో పెట్టేసింది శివకార్తికేయన్ టీం.
ఈ చిత్రంలో విశ్వరూపం ఫేం రాహుల్ బోస్ (RahulBose) విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే సాయిపల్లవి కశ్మీర్ లొకేషన్లో దిగిన ఫొటోలు కూడా నెటిజన్లను ఇంప్రెస్ చేస్తున్నాయి. శివకార్తికేయన్ మరోవైపు అయలాన్ (Ayalaan) చిత్రంలో కూడా నటిస్తున్నాడు. ఆర్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ భామ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
శివకార్తికేయన్ న్యూ లుక్..
On this vibrant occasion, project #SK21 celebrates its triumphant finish at Kashmir, we thank our Real Hero’s – Indian Military for guiding us throughout. #75daysofKashmirshoot #SK21FirstScheduleWrap#Ulaganayagan @ikamalhaasan @Siva_Kartikeyan @gvprakash @RKFI @Sai_Pallavi92 pic.twitter.com/3DVQ6sTweh
— Vamsi Kaka (@vamsikaka) August 31, 2023