Sitara Ghattamaneni | చిన్న వయసులోనే సితార రికార్డు.. ప్రముఖ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా..
Sitara Ghattamaneni | టాలీవుడ్ స్టార్ నటుడు మహేశ్‌బాబు (Mahesh Babu) గారాల పట్టి సితార (Sitara Ghattamaneni) ఓ రికార్డు సొంతం చేసుకుంది. ప్రముఖ జ్యూవెలరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ (Brand ambassador)గా మారింది.
Sitara Ghattamaneni | టాలీవుడ్ స్టార్ నటుడు మహేశ్‌బాబు (Mahesh Babu) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అటు సినిమాలు, ఇటు బిజినెస్‌లు అంటూ ఎప్పుడూ బిజీగా గడుపుతుంటారు. సోషల్ మీడియాకు మహేశ్ ఎప్పుడూ దూరంగా ఉంటారు. దొరికిన సమయాన్ని పిల్లలు, కుటుంబ సభ్యులతో గడిపేందుకే కేటాయిస్తుంటారు. ఇక మహేశ్ గారాల పట్టి సితార (Sitara Ghattamaneni) మాత్రం నెట్టింట తెగ సందడి చేస్తుంటుంది.
డ్యాన్స్, ఇతర యాక్టివిటీస్‌తో అందరినీ ఆకర్షిస్తుంటుంది. సితారకు ఇప్పటికే ఇన్‌స్టాలో 12లక్షలకు పైగానే ఫాలోవర్స్ ఉన్నారు. ఇక టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి సొంతంగా ఓ యూట్యూబ్ చానెల్ కూడా నిర్వహిస్తోంది. ఆ చానెల్లో సితార చేసే అల్లరి అతా ఇంతా కాదు. సోషల్ మీడియా ద్వారానే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సితార.. తాజాగా మరో రికార్డు సొంతం చేసుకుంది. ప్రముఖ జ్యూవెలరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ (Brand ambassador)గా మారింది.
సితారకు ఉన్న ఫ్యాన్ బేస్‌ను దృష్టిలో ఉంచుకొని ఓ ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ సితారను తన ప్రచారకర్తగా నియమించుకుంది. ఇందుకోసం ఆమెకు పెద్ద మొత్తంలోనే రెమ్యునరేషన్ అందించినట్లు సమాచారం.
ఇప్పటికే ముంబైలో మహేశ్-నమ్రతల సమక్షంలో సితారతో మూడు రోజుల పాటు యాడ్ షూట్ కూడా చేశారట. ప్రముఖ టెక్నీషియన్లు ఈ యాడ్ కోసం పనిచేసినట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన యాడ్ టీవీల్లో కనిపించనుంది. యాడ్‌లో పాల్గొన్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, ప్రీమియం జ్యువెలరీ బ్రాండ్ (premium jewellery brand)ను ఆమోదించి అతిపెద్ద యాడ్ కాంట్రాక్ట్ పై సంతకం చేసిన మొదటి భారతీయ స్టార్ కిడ్‌గా సితార నిలిచింది.
Sitara Ghattamaneni, The Most Happening star kid to bag a major jewellery brand contract! Proud parents Mahesh Babu and Namrata are overjoyed!
Stay tuned for the grand TVC launch! @urstrulyMahesh #NamrataShirodkar #Sitara pic.twitter.com/ItkANNeaUQ
— Vamsi Kaka (@vamsikaka) May 26, 2023
Also Read..
Meta Layoffs | మెటాలో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. భారత్‌లోని టాప్ ఉద్యోగులపై లేఆఫ్స్ ప్రభావం
Alibaba | లేఆఫ్స్ వేళ అలీబాబా గుడ్ న్యూస్.. 15 వేల మంది ఉద్యోగుల్ని నియమించుకోనున్నట్లు ప్రకటన
Woman | 17 ఏళ్ల క్రితం అపహరణకు గురైన యువతి.. నేడు ఢిల్లీలో ప్రత్యక్షం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

