Sitara | సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్.. వార్నింగ్ ఇచ్చిన మహేశ్ బాబు కూతురు సితార
Sitara | సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కుమార్తె సితార ఘట్టమనేని తన పేరుతో సోషల్ మీడియాలో చలామణి అవుతున్న నకిలీ ఖాతాలపై తీవ్రంగా స్పందించారు. తన అభిమానులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ఆమె ఒక ప్రకటన విడుదల చేసింది.
Sitara | సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కుమార్తె సితార ఘట్టమనేని తన పేరుతో సోషల్ మీడియాలో చలామణి అవుతున్న నకిలీ ఖాతాలపై తీవ్రంగా స్పందించారు. తన అభిమానులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ ఆమె ఒక ప్రకటన విడుదల చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తప్ప ఇతర ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కూడా అఫీషియల్ అకౌంట్ లేదని సితార స్పష్టం చేసింది. ఈ విషయంపై సితార తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ పెట్టింది.
‘నా పేరు మీద అనేక నకిలీ, స్పామ్ ఖాతాలు క్రియేట్ చేస్తున్నట్లుగా నేను గమనించాను. నా స్నేహితులు, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులందరికీ చెప్పేది ఒక్కటే. నేను కేవలం ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే యాక్టివ్‌గా ఉంటాను. ఇది మాత్రమే నా అఫీషియల్ అకౌంట్. ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో నా పేరుతో ఉన్న అకౌంట్స్‌తో జాగ్రత్తగా ఉండండి’ అంటూ సితార సూచించింది. సితార ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా చురుగ్గా ఉంటారు. ఆమె కుటుంబం, వ్యక్తిగత అప్డేట్స్, బ్రాండ్స్‌తో తన కొలాబరేషన్స్ గురించి తరచూ అప్డేట్లు పోస్ట్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా, సితార ‘సర్కారు వారి పాట’ చిత్రంలోని ‘పెన్నీ’ పాట ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వస్తున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
AKKA Teaser | కీర్తి సురేశ్ బర్త్‌డే స్పెషల్.. ‘అక్క’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్ విడుదల!
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

