Kamal234 | కమల్ హాసన్-మణిరత్నం ప్రాజెక్ట్‌లో శింబు
Kamal Haasan-Maniratnam Movie | విక్రమ్‌తో తిరుగులేని కంబ్యాక్ ఇచ్చిన కమల్ అదే జోష్‌తో ఇండియన్-2ను రెడీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
Kamal Haasan-Maniratnam Movie | విక్రమ్‌తో తిరుగులేని కంబ్యాక్ ఇచ్చిన కమల్ అదే జోష్‌తో ఇండియన్-2ను రెడీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత కమల్ మణిరత్నంతో సినిమా చేయబోతున్నాడు. దాదాపు 36 సంవత్సరాల తర్వాత ఈ కాంబినేషన్లో సినిమా రానుండటంతో అందరిలోనూ తిరుగులేని ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో శింబు కీలకపాత్ర పోషించనున్నట్లు సమాచారం. శింబు క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని, కథను మలుపుతిప్పే పాత్రలో కనిపించబోతున్నాడని ఇన్సైడ్ టాక్. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఇండియన్-2లో కమల్ బిజీగా ఉన్నాడు. ఇటీవలే పర్మిషన్ లేని కారణంగా చెన్నై ఏయిర్‌పోర్ట్‌లో షూటింగ్ ఆగిపోయింది. ప్రస్తుతం ఏయిర్పోర్ట్ చుట్టు పక్కల ప్రాంతాల్లోనే షూటింగ్‌ను జరుపుతున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్. జే. సూర్య కీలకపాత్ర పోషిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sreemukhi | మత్తెక్కించే చూపులతో శ్రీముఖి..
MLA Sudheer Reddy | రెండో పంట వేయవద్దన్న రేవంత్ రెడ్డికి రెండోసారి ఓటు వేయవద్దు: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Indian Student Died In Bangladesh | బంగ్లాదేశ్‌లో భారతీయ వైద్య విద్యార్థి అదృశ్యం.. కాలేజీ సమీపంలోని చెరువులో మృతదేహం
Harish Rao | సోకులకు నిధులుంటాయి.. రైతులకు ఇవ్వడానికి ఉండవా రేవంత్ ? : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

