30 కిలోలు బరువు తగ్గిన ఈ హీరో ఎలా మారాడో చూడండి..!

పాత్రకు తగ్గట్టుగా తమ శరీరాన్ని మలచుకోవడం చాలా కష్టం. ఒక్కోసారి బాగా బరువు పెరగాల్సి ఉంటుంది, లేదంటే బాగా సన్నబడాల్సి వస్తుంది. సైజ్ జీరో సినిమా కోసం అనుష్క భారీగా బరువు పెరిగింది. కృతి సనన్ కూడా తాను ప్రగ్నెంట్‌గా కనిపించేందుకు కొంచెం లావెక్కింది. అయితే తమిళ నటుడు శింబు ప్రస్తుతం చేస్తున్న‘వెందు తనిందదు కాడు’ సినిమా కోసం ఏకంగా 30 కేజీల బరువు తగ్గి అందరిని ఆశ్చర్యపరిచాడు.
శింబు- గౌతమ్ మీనన్ కాంబినేషన్ అంటే ప్రేక్షకులలో ఏరేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది వరకే ‘ఏమాయ చేసావె’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ తమిళ రీమేక్ వెర్షన్లు రాగా, ఇప్పుడు ‘వెందు తనిందదు కాడు’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఇందులో శింబు లుంగీ ధరించి, కర్రపట్టుకుని అమాయకంగా కనిపించాడు శింబు. అతని వెనక ప్రాంతంలో మంటలు చెలరేగుతుంటాయి.
‘వెందు తనిందదు కాడు’ అంటే కాలి బూడిదైన అడవి అని అర్థం. టైటిల్‌ని బట్టి ఈ చిత్రం అడవి నేపథ్యంలో రూపొందుతుందని అర్దమవుతుంది. అయితే శింబు తాజాగా తన సోషల్ మీడియాలో స్లిమ్ లుక్‌లోకి మారన ఫొటోలు షేర్ చేశాడు. ఇందులో క్లీన్ షేవ్‌తో డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఇది చూసిన వారందరు శింబు ట్రాన్స్‌ఫర్మేషన్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘వెందు తనిందదు కాడు’ కోసం శింబు ఇలా మారగా, ఈ చిత్రానికి ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. వెల్స్ ఇంటర్నేషనల్ పతాకంపై డాక్టర్ ఇషారీ కె. గణేశ్ నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- new look
- simbu
- tamil hero
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
Prakash Raj | 23న దేశవ్యాప్తంగా ప్రజామార్చ్.. ‘పీపుల్ అగైనెస్ట్ సర్’ కూటమి పిలుపు
SIR | ప్రపంచమంతా ‘జంతర్ మంతర్’! సర్‌కు వ్యతిరేకంగా అనేక దేశాల్లో ప్రవాస భారతీయుల నిరసనలు
India vs Zimbabwe T20I | అమ్మాయిలు అదుర్స్.. దంచికొట్టిన షెఫాలీ, మంధాన.. రెండో టీ20లో భారత్ ఘన విజయం
Saddula Bathukamma | అంబరాన్నంటిన సద్దులు.. ట్యాంక్‌బండ్‌పై ఘనంగా వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా రష్మిక-విజయ్ జంట
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

