Siddu Gadi Love Story | యూత్ కు నచ్చే అన్ని అంశాలతో ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ ఆకట్టుకుంటుంది : డైరెక్టర్ రమేష్ బాబు చెరుకూరు
మనోజ్, శృతి, మోహన సిద్ధి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ "సిద్ధుగాడి లవ్ స్టోరీ". శివ బ్రహ్మేంద్ర క్రియేషన్స్ పతాకంపై బాల బ్రహ్మచారి చెరుకూరు, శివ బ్రహ్మిణి చెరుకూరు సమర్పణలో నిర్మాత సావిత్రమ్మ చెరుకూరు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
మనోజ్, శృతి, మోహన సిద్ధి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ “సిద్ధుగాడి లవ్ స్టోరీ”. శివ బ్రహ్మేంద్ర క్రియేషన్స్ పతాకంపై బాల బ్రహ్మచారి చెరుకూరు, శివ బ్రహ్మిణి చెరుకూరు సమర్పణలో నిర్మాత సావిత్రమ్మ చెరుకూరు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ తెలుగు సినిమాపై ఉన్న మక్కువతో రమేష్ బాబు చెరుకూరు ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 27న (శుక్రవారం) గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించి సినిమా విశేషాలను పంచుకుంది.
ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వై.వి. రావు మాట్లాడుతూ.. “యువత అభిరుచికి తగ్గట్టుగా, వారికి నచ్చే కంటెంట్ తో తెరకెక్కే సినిమాలు ఎప్పుడూ విజయం సాధిస్తాయి. అలాంటి ఆసక్తికరమైన కమర్షియల్ అంశాలతో రూపొందిన మా ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ చిత్రం కూడా ప్రేక్షకులందరి ఆదరణ పొందుతుందని బలంగా నమ్ముతున్నాము” అని అన్నారు.
రైటర్ శ్రీధర్ మాట్లాడుతూ.. “నేటి తరం యువత తమ జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి, ఉన్నత అవకాశాల కోసం నగరాలకు వలస వెళ్తుంటారు. అలా కొత్తగా సిటీకి వెళ్లిన తర్వాత అక్కడ వాళ్లు ఎలాంటి పరిస్థితులు, సవాళ్లు ఎదుర్కొంటారు అనే అంశాన్ని మా సినిమాలో చాలా ఆసక్తికరంగా, వినోదాత్మకంగా చూపించాము. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఈ మూవీ యూత్ అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది” అని తెలిపారు.
హీరోయిన్ శృతి మాట్లాడుతూ.. “ఈ చిత్రంలో నేను చాలా అల్లరి చేసే అమ్మాయి పాత్రలో కనిపిస్తాను. కథ ప్రారంభంలో ఎంతో బబ్లీగా, ఉత్సాహంగా ఉండే నా పాత్ర, ఆ తర్వాత హీరో ప్రేమ కోసం ఎలా మారిపోయిందనేది చాలా ఆకట్టుకుంటుంది. యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే మంచి చిత్రమిది. రేపు విడుదలవుతున్న మా సినిమాను అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.
దర్శకుడు రమేష్ బాబు చెరుకూరు మాట్లాడుతూ.. “నాకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఎంతో ప్యాషన్. ఆ ఇష్టంతోనే ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ చిత్రాన్ని రూపొందించాను. యూత్ కు నచ్చే అంశాలతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఆకట్టుకునే ఎమోషన్స్ కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఈ నెల 27న మా మూవీ థియేటర్లలోకి వస్తోంది. తెలుగు ప్రేక్షకులు, సినీ అభిమానులు మా కొత్త ప్రయత్నాన్ని ఆశీర్వదించి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను” అని అన్నారు.
హీరో మనోజ్ మాట్లాడుతూ.. “‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’ ఒక చక్కటి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్. ఇందులో కామెడీ, ఎమోషన్, ప్రేమతో పాటు చక్కటి ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది. ముఖ్యంగా బీటెక్ పూర్తి చేసి, కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నగరాలకు వెళ్లే కుర్రాళ్లు ఈ కథకు బాగా కనెక్ట్ అవుతారు. నా నిజ జీవితంలో కూడా నేను అలాగే హైదరాబాద్ వచ్చాను కాబట్టి ఈ పాత్ర నాకు చాలా దగ్గరైంది. సిటీకి వచ్చిన యువత ఎదుర్కొనే ఇబ్బందులను వాస్తవికంగా, వినోదాత్మకంగా ఇందులో చూపించాము. ఈ సినిమాలో నేను సిద్ధు పాత్రలో నటించాను. ఇప్పటికే విడుదలైన పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. శుక్రవారం థియేటర్లలోకి వస్తున్న మా చిత్రం మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది” అని ధీమా వ్యక్తం చేశారు.
ఈ చిత్రంలో మనోజ్, శృతి, మోహన సిద్ధిలతో పాటు సీనియర్ నటుడు సుమన్, సర్కార్, చిత్రం శ్రీను, జబర్దస్త్ అప్పారావు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. దొసాడ యాదగిరి సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి సి.ఎన్. ఆదిత్య సంగీతం సమకూర్చగా, లక్కీ ఎక్కరి ఎడిటర్ గా వ్యవహరించారు. తూఫాన్ ఫైట్స్, నాని ఆర్ట్ డైరెక్షన్, రమేష్ బాబు చెరుకూరు మరియు రజని సాగర్ కొరియోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి వి. సాంబశివరావు, వేణుగోపాల చారీ చెరుకూరు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా పనిచేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | బాహుబలి కాంబో మరోసారి రిపీట్ కాబోతోందా …2028 తర్వాత రాజమౌళి భారీ ప్లాన్!
Elon Musk | ప్రతి చిన్నారికి రెండు స్పేస్ ఎక్స్ షేర్లు.. ఎక్స్ వేదికగా ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన..!
Padma devender reddy | రైతులతో మాట్లాడిన పద్మాదేవేందర్ రెడ్డి.. పంట నష్టంపై ఆరా
Tata Sons | టాటా సన్స్‌లో తీవ్రస్థాయికి నాయకత్వ వివాదం.. బాంబే హైకోర్టుకు టాటా ట్రస్టులు..!
Congress MLA | హామీలపై నిలదీసినందుకు మైనార్టీలపై చిందులేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ

