Takkar | హెయిర్ సెలూన్ ఫన్ ట్రాక్.. సిద్దార్థ్ టక్కర్ సిరీస్ ఎపిసోడ్ 1 వీడియో
Takkar | పాపులర్ యాక్టర్ సిద్దార్థ్ (Siddharth) నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ టక్కర్ (Takkar). జూన్ 9న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. తాజాగా టక్కర్ సిరీస్ ఎపిసోడ్ 1 వీడియోను విడుదల చేశారు. ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ పేరుతో విడుదల చేసిన ఈ వీడియో హెయిర్ సెలూన్లో జరిగే ఫన్ ట్రాక్‌తో సాగుతోంది.
Takkar | పాపులర్ యాక్టర్ సిద్దార్థ్ (Siddharth) నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ టక్కర్ (Takkar). రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ మూవీని కార్తీక్ జీ క్రిష్ డైరెక్ట్ చేస్తున్నాడు. జూన్ 9న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో బిజీగా ఉంది సిద్దార్థ్ టీం. ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే సాంగ్స్ విడుదల చేసిన మేకర్స్.. తాజాగా టక్కర్ సిరీస్ ఎపిసోడ్ 1 వీడియోను విడుదల చేశారు. ఎక్స్పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ పేరుతో విడుదల చేసిన ఈ వీడియో హెయిర్ సెలూన్లో జరిగే ఫన్ ట్రాక్‌తో సాగుతోంది.
డైరెక్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పాలంటున్నారు ఈ వీడియో చూసిన సినీ జనాలు. ఇప్పటికే టక్కర్ నుంచి విడుదల చేసిన టీజర్‌తోపాటు కయ్యాలే వీడియో సాంగ్, ఊపిరే లిరికల్ వీడియో సాంగ్స్‌కు మంచి స్పందన వస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో రాబోతున్న ఈ చిత్రంలో యోగిబాబు, అభిమన్యు సింగ్, మునిష్కాంత్, విఘ్నేశ్ కాంత్, రామ్‌దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
పేద యువకుడు, డబ్బున్న అమ్మాయికి మధ్య సాగే కథతో టక్కర్ తెరకెక్కుతోంది. మజిలీ ఫేం దివ్యాంశ కౌశిక్ ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్ బ్యానర్లపై సుధాన్ సుందరం, జీ జయరామ్, టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. టక్కర్ చిత్రానికి నివాస్ కే ప్రసన్న సంగీతం అందిస్తున్నారు.
Expectation vs Reality..
#Takkar Series Epsiode 01 Out Now 🤩
GUNZ : Expectation vs Reality
In Cinemas on JUNE 9th
Starring #Siddharth
Directed by @Karthik_G_Krish#TakkarFromJune9@AAArtsOfficial @itsdivyanshak @PassionStudios_ @nivaskprasanna @editorgowtham… pic.twitter.com/xOYVh1mwub
— People Media Factory (@peoplemediafcy) June 6, 2023
ఊపిరే లిరికల్ వీడియో సాంగ్..
కయ్యాలే వీడియో సాంగ్..
టక్కర్ టీజర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

