Siddharth | సిద్ధార్థ్–అదితి ప్రేమకథ మరోసారి వైరల్ .. పుట్టినరోజు శుభాకాంక్షలతో ఆకట్టుకున్న స్టార్ జంట
Siddharth | టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నిలిచిన స్టార్ జంట సిద్ధార్థ్ – అదితి రావు హైదరి మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యారు. ప్రేమతో ప్రారంభమైన వీరి బంధం వివాహంతో మరింత బలపడగా, పెళ్లి తర్వాత కూడా ఈ జంట అన్యోన్యతతో అభిమానులను ఆకట్టుకుంటోంది. పెళ్లి తర్వాత వీరిద్దరూ తమ వ్యక్తిగత జీవితాన్ని ఎంతో హుందాగా, సంతోషంగా గడుపుతున్నారు.
Siddharth | టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నిలిచిన స్టార్ జంట సిద్ధార్థ్ – అదితి రావు హైదరి మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యారు. ప్రేమతో ప్రారంభమైన వీరి బంధం వివాహంతో మరింత బలపడగా, పెళ్లి తర్వాత కూడా ఈ జంట అన్యోన్యతతో అభిమానులను ఆకట్టుకుంటోంది. పెళ్లి తర్వాత వీరిద్దరూ తమ వ్యక్తిగత జీవితాన్ని ఎంతో హుందాగా, సంతోషంగా గడుపుతున్నారు. ముఖ్యంగా సిద్ధార్థ్ తన భార్య అదితిపై చూపించే ప్రేమ, గౌరవం తరచూ ప్రజల్లో చర్చకు దారి తీస్తోంది. పబ్లిక్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలలో కూడా అదితి గురించి మాట్లాడటం ద్వారా ఆమెకు తన జీవితంలో ఉన్న ప్రాధాన్యతను వెల్లడిస్తున్నాడు.
సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా అదితి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఎంతో ప్రత్యేకంగా ఆయనను “మ్యానికార్న్” అంటూ పిలుస్తూ చేసిన శుభాకాంక్షలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ పిలుపు వెనుక వారి మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధం, ప్రేమను ప్రతిబింబిస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అదితి తన పోస్ట్‌లో సిద్ధార్థ్‌ను సూర్యుడితో పోలుస్తూ, “నా జీవితానికి వెలుగు నీవే, నా నవ్వుల వెనుక కారణం నీవే” అంటూ భావోద్వేగంగా వర్ణించారు. ఆమె షేర్ చేసిన అందమైన ఫోటోలు ఈ జంట మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత స్పష్టంగా చూపించాయి. ఈ పోస్ట్ చూసిన అభిమానులు, సినీ ప్రముఖులు సిద్ధార్థ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ జంట ఇలాగే కలకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు.
సంప్రదాయబద్ధంగా ఒక పురాతన ఆలయంలో వివాహం చేసుకున్న ఈ జంట, గ్లామర్ ప్రపంచానికి అతీతంగా నిజ జీవితంలోనూ ఆదర్శ దంపతులుగా నిలుస్తున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, గౌరవించుకుంటూ ముందుకు సాగుతున్న వీరి బంధం అనేక మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. కెరీర్ విషయానికి వస్తే, అదితి ప్రస్తుతం ‘పరివారిక్ మనురంజన్’, ‘లయనెస్’ వంటి హిందీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు సిద్ధార్థ్ ‘పరమ్ సుందరి’ తర్వాత ‘వివాన్ – ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఇటీవల ఆయనకు అవకాశాలు కొంత తగ్గినప్పటికీ, తనదైన శైలిలో మళ్లీ రీ-ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు ఆశిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

