మాటలకందని అనుభూతి

నటనతో పాటు సంగీతం, కవితారచనలో కూడా చెన్నై చిన్నది శృతిహాసన్‌కు మంచి ప్రవేశం ఉన్న విషయం తెలిసిందే. సినిమాలతో పాటు ఇండిపెండెంట్ ఆల్బమ్స్ ద్వారా స్వరకర్తగా సత్తా చాటుకుంది. సంగీత పరిజ్ఞానంతో పాటు తన మనసులోని భావాల్ని కవితారూపంలో వ్యక్తం చేస్తూ శృతిహాసన్ గొప్ప ప్రతిభను కనబరుస్తుంటుంది. చిన్నతనం నుంచే పొయెట్రీ రాయడం సాధన చేశానని..మనసుకు సాంత్వన చేకూర్చే గొప్ప ప్రక్రియ కవిత్వం అని పేర్కొంది. ఆమె మాట్లాడుతూ ‘స్కూల్రోజుల నుంచి పొయెట్రీ రాయడం అలవాటు చేసుకున్నా. అయితే ఆ తర్వాత కాలంలో కవిత్వ రచనను నేనెప్పుడు సీరియస్‌గా తీసుకోలేదు. హృదయం సంఘర్షణకు గురైనప్పుడు, ఏవైనా సంఘటనలు నన్ను కదిలించినప్పుడు మనసులోని భావాల్ని అక్షరరూపంలో వ్యక్తం చేస్తుంటా. నాలో చెలరేగే కల్లోలానికి కవిత్వం శాంతిని ప్రసాదిస్తుంది. కాగితంపై పరచుకున్న నా భావాల్ని చూస్తే మాటలకందని అనుభూతికి లోనవుతా’ అని చెప్పింది. ప్రస్తుతం తెలుగులో శృతిహాసన్ ‘సలార్’ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Music
- salar
- shruthi hassan
- singer
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

