Music School | మ్యూజిక్ స్కూల్ నుంచి శర్మాన్ జోషి, శ్రియాశరణ్ Teri Nigaahon Ne వీడియో సాంగ్
Music School | బాలీవుడ్ నటుడు శర్మాన్ జోషి, శ్రియాశరణ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం మ్యూజిక్ స్కూల్ (Music School). మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ నుంచి తాజాగా మేకర్స్ Teri Nigaahon Ne వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.
Music School | బాలీవుడ్ నటుడు శర్మాన్ జోషి, శ్రియాశరణ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం మ్యూజిక్ స్కూల్ (Music School). పాపారావు బియ్యాల (మాజీ ఐఏఎస్ అధికారి) దర్శకత్వం వహిస్తున్నాడు. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుంచి Padhte Jao Baccha సాంగ్‌ను విడుదల చేయగా.. మ్యూజిక్ లవర్స్ ను ఇంప్రెస్ చేస్తోంది. తాజాగా మేకర్స్ Teri Nigaahon Ne వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఇళయ రాజా మ్యాజికల్ మ్యూజిక్‌తో శ్రియా శరణ్, శర్మాన్ జోషి మధ్య సాగే బ్యూటిఫుల్ రొమాంటిక్ ట్రాక్ అందరినీ ఆకట్టుకుంటోంది.
రామ రఘువంశి, డాక్టర్ సాగర్ రాసిన ఈ పాటను శ్రేయా ఘోషల్, జావెద్ అలీ పాడారు. ఆడమ్ ముర్రే నృత్యరీతులు సమకూర్చాడు. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ పాట సినిమాకే హైలెట్‌గా నిలువబోతుందని వీడియో సాంగ్‌తో తెలిసిపోతుంది. మ్యూజిక్ స్కూల్ సమాజం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల నుంచి అకడమిక్ ఒత్తిళ్లను ఎదుర్కొనే విద్యార్థుల సున్నిత, ప్రబలమైన సంగీత నేపథ్య కథనంతో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పదకొండు పాటలున్నాయి.
ఈ చిత్రానికి కిరణ్ డియోహాన్స్ సినిమాటోగ్రాఫర్. ప్రకాశ్ రాజ్, ఒజు బరువా (డెబ్యూ), గ్రేసీ గోస్వామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బెంజమిన్ జిలానీ, సుహాసినీ మూలే, లీలా సామ్సన్, బగ్స్ భార్గవ, వినయ్ వర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, వఖార్ షేఖ్, ఫణి, ఇతర చైల్డ్ ఆర్టిస్టులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. యామిని ఫిలిమ్స్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని హిందీ, తెలుగులో చిత్రీకరించగా.. తమిళంలో డబ్ చేస్తున్నారు. మే 12న విడుదల కానుండగా.. హిందీలో పీవీఆర్, తెలుగులో దిల్ రాజు విడుదల చేస్తున్నారు.
Teri Nigaahon Ne వీడియో సాంగ్..
ఏవో సరాగాలు (తెలుగు వెర్షన్) వీడియో సాంగ్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

