Shriya saran | సంగీతభరిత కథ

గత కొన్నేళ్లుగా కథాంశాల ఎంపికలో వైవిధ్యతకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తున్నది శ్రియ. తాజాగా ఆమె మరో ప్రయోగాత్మక చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. శ్రియ, శర్మన్‌జోషి జంటగా నటిస్తున్న చిత్రం ‘మ్యూజిక్‌స్కూల్’. పాపారావు బియ్యాల స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బాలీవుడ్ నేపథ్యగాయకుడు షాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దసరా రోజున ఈ చిత్రం ప్రారంభమైంది. నవంబర్ 15 నుంచి గోవాలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నది. దర్శకనిర్మాత మాట్లాడుతూ ‘సంగీతభరిత కథాంశంతో తెలుగు, హిందీ భాషల్లో సినిమాను తెరకెక్కిస్తున్నాం. నేటి విద్యావ్యవస్థలో సృజనాత్మకత లోపించింది. ఇంజినీర్స్, డాకర్లను తయారుచేయాలనే విధానం వల్ల పిల్లలపై ఒత్తిడి పెరుగుతున్నదని చాటిచెప్పే చిత్రమిది. చదువులో కళలు, ఆటలను భాగం చేయాలనే సందేశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ఇళయరాజా సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పాటల రిహార్సల్ ఇటీవల హైదరాబాద్‌లో ప్రారంభించాం. హాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఆడమ్ ముర్రే ఇందులో భాగమయ్యారు. శ్రియ, శర్మన్‌జోషి పాత్రలు సరికొత్తగా ఉంటాయి’ అని తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- music school
- Shriya saran
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne krishank | కుంభకోణాలు చేయడం వల్లే రూ.50 వేల కోట్లు దోచుకున్నారు : మన్నె క్రిశాంక్
Symbiosis Professor: మాజీ విద్యార్థినికి అనుచిత మెసేజ్‌లు పంపిన సింబయాసిస్ ప్రొఫెసర్
Manne krishank | మీ పాత్ర లేకపోతే సీబీఐ విచారణ చేపట్టండి.. సీఎం రేవంత్‌కు మన్నె క్రిశాంక్ సవాల్
LK Advani: మెరుగుపడిన ఆరోగ్యం.. ఆస్పత్రి నుంచి ఎల్కే అద్వానీ డిశ్చార్జ్
Netanyahu | అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు : నెతన్యాహు
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

