తండ్రి ఎదురీత

‘సై’, ‘మగధీర’, ‘శ్రీమంతుడు’తో పాటు పలు సినిమాల్లో విలన్‌గా, సహాయనటుడిగా కనిపించి మెప్పించారు శ్రవణ్ రాఘవేంద్ర. ఆయన కథానాయకుడిగా పరిచయమవుతున్న తాజా చిత్రం ‘ఎదురీత’. బాలమురుగన్ దర్శకుడు. బోగారి లక్ష్మీనారాయణ, బోగారి ఈశ్వర్ చరణ్ నిర్మాతలు. లియోనా లిషోయ్ కథానాయిక. ఈ చిత్ర సెన్సార్ పూర్తయింది. నిర్మాతలు మాట్లాడుతూ ‘తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే చిత్రమిది. నలభై ఏళ్ల మధ్యతరగతి తండ్రికి తన కొడుకుపై ఉన్న ప్రేమ ఎలాంటి సమస్యల్ని తీసుకొచ్చిందనేది ఆసక్తికరంగా ఉంటుంది. కథలోని సెంటిమెంట్ మనసుల్ని హత్తుకుంటుంది. విజయ్ మిల్టన్ వద్ద గోలీసోడా, కడుగు, టెన్ చిత్రాలకు దర్శకత్వశాఖలో పనిచేసిన బాలమురుగన్ వినూత్నమైన కథాంశంతో అద్భుతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. త్వరలో పాటల్ని విడుదలచేసి ఆ తర్వాత సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అని తెలిపారు. సంపత్‌రాజ్, జియాశర్మ, నోయల్, శాన్వీ మేఘన ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అరల్ కొరెళ్లి, సాహిత్యం: చల్లా భాగ్యలక్ష్మి, శ్రేష్ట, రోల్ రైడా, విశ్వ, స్వామి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

