నాలోని మాస్ కోణాన్ని చూపించా!

సినిమా ఫెయిలవుతుంది.. కానీ దర్శకుడు మాత్రం ఎప్పటికీ ఫెయిల్ కాడని తెలిపారు శ్రీకాంత్ అడ్డాల. కుటుంబ విలువలు, సున్నితమైన భావోద్వేగాలతో మనుషుల్లోని మంచితనాన్ని ఆవిష్కరిస్తూ ఇదివరకు తాను సినిమాలు చేశానని, తన శైలికి భిన్నంగా తొలిసారి యాక్షన్ సినిమా తెరకెక్కించడం దర్శకుడిగా కొత్త అనుభూతిని పంచిందన్నారు. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘నారప్ప’. వెంకటేష్ హీరోగా నటించిన ఈ చిత్రం నేడు అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలకానుంది. ఈ సందర్భంగా సోమవారం శ్రీకాంత్ అడ్డాల పాత్రికేయులతో పంచుకున్న ముచ్చట్లివి..
మంచి కథల్ని రీమేక్ చేస్తున్నప్పుడు పెద్దగా మార్పులు చేయాల్సిన అవసరం రాదు. ‘నారప్ప’ అలాంటి కథే. మన నేటివిటీకి అనుగుణంగా కొన్ని చిన్న మార్పులు చేస్తూ తెలుగు ప్రేక్షకుల్ని కనెక్ట్ అయ్యేలా సినిమాను తెరకెక్కించాను. ‘అసురన్’ సినిమా బాగుందని మా అసిస్టెంట్ చెబితే చూశా. చాలా బాగా నచ్చింది. అవకాశం వస్తే తెలుగు రీమేక్‌ను తెరకెక్కించాలని అనుకున్నా. ఆ సినిమా హక్కులు సురేష్‌బాబు తీసుకున్నారని తెలిసి ఆయన్నే ఆ మాట అడిగా. వెంకటేష్, సురేష్‌బాబు అంగీకరించడంతో సినిమా మొదలైంది.
మాస్ కోణాన్ని ఆవిష్కరిస్తూ
దర్శకుడిగా నాలోని మాస్ కోణాన్ని ఆవిష్కరించే చిత్రమిది. జోనర్ మారినా నా శైలి సెన్సిబిలిటీస్ అన్ని ఈ సినిమాలో ఉంటాయి. ఒక దర్శకుడికిఎలాంటి కథతోనైనా సినిమా చేయగలిగే సత్తా ఉంటుందని నేను భావిస్తా. నారప్పను చాలెంజింగ్ కంటే ఎైగ్జెటింగ్ భావించి రూపొందించా. ఓటీటీలో ఈ సినిమా విడుదలవుతుందని ఎవరూ అనుకోలేదు. థియేటర్ రిలీజ్ కోసమే రూపొందించాం. ఇలాంటి పెద్ద సినిమాను థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. పరిస్థితులు వల్ల ఓటీటీలో విడుదల చేయాల్సివస్తోంది. ఈ నిర్ణయం వల్ల నాతో పాటు వెంకటేష్, సురేష్‌బాబు అందరం నిరుత్సాహపడ్డాం.
ధనుష్‌తో పోలికలు ఉండవు
60 ఏళ్ల వయస్కుడిగా వెంకటేష్ పాత్ర ప్రయోగాత్మకంగా ఉంటుంది. నారప్ప పాత్రలో పరకాయప్రవేశం చేశారాయన. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లో బరువు తగ్గి నటించారు. ధనుష్‌తో ఏ మాత్రం పోలికలు లేకుండా తనదైన శైలిలో అభినయాన్ని కనబరిచారు.
గీతా ఆర్ట్స్‌లో ‘అన్నాయ్’
నేను వేగంగా సినిమాలు చేయలేను. అందుకే కెరీర్లో ఎక్కువ గ్యాప్ వచ్చింది. ‘అన్నాయ్’ పేరుతో గీతా ఆర్ట్స్‌లో తదుపరి సినిమా చేయబోతున్నా. పీరియాడికల్ కథాంశంతో 1970-80 బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. మూడు భాగాలుగా తెరకెక్కించాలనుకుంటున్నారు. భారీ స్థాయిలో ఈ సినిమాను చేయబోతున్నాను.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

