Anil Ravipudi | కమర్షియల్ హీరోలు, దర్శకులు ప్రయోగాలు చేయకూడదా.. చేస్తే నేరమా..?
Anil Ravipudi | అదేంటి అంత మాట అంటున్నారు.. ప్రయోగాలు చేయకుండా ఎప్పుడు రెగ్యులర్ సినిమాలు చేయమంటారా ఏంటి అనుకోవచ్చు. కానీ కమర్షియల్ సినిమాలే మన హీరోలకు సేఫ్ జర్నీ. అలా కాదని వాళ్ళ ఇమేజ్ పక్కన పెట్టి ప్రయోగాలు చేసిన ప్రతిసారి కమర్షియల్ గా చాలా పెద్ద లాస్ వస్తుంది.
Anil Ravipudi | అదేంటి అంత మాట అంటున్నారు.. ప్రయోగాలు చేయకుండా ఎప్పుడు రెగ్యులర్ సినిమాలు చేయమంటారా ఏంటి అనుకోవచ్చు. కానీ కమర్షియల్ సినిమాలే మన హీరోలకు సేఫ్ జర్నీ. అలా కాదని వాళ్ళ ఇమేజ్ పక్కన పెట్టి ప్రయోగాలు చేసిన ప్రతిసారి కమర్షియల్ గా చాలా పెద్ద లాస్ వస్తుంది. మహేష్ బాబుకు ఈ విషయం బాగా తెలుసు. ఆయన కెరీర్లో ప్రయోగాలు చేద్దాం అని వెళ్ళిన ప్రతిసారి ఎదురు దెబ్బలు తిన్నాడు. అవన్నీ సరే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు కదా..!
నిప్పు లేనిదే పొగరాదు అన్నట్టు.. విషయం లేకుండా మేమెందుకు దీని గురించి చర్చిస్తాం చెప్పండి. తాజాగా అనిల్ రావిపూడి, బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన భగవంత్ కేసరి సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీనికి పాజిటివ్ టాక్ వచ్చింది.. కానీ కలెక్షన్స్ మాత్రం ఊహించిన స్థాయిలో రాలేదు. వీరసింహారెడ్డికి నెగిటివ్ దాకా వచ్చినా కూడా మొదటి రోజే దాదాపు 65 కోట్ల గ్రాస్ వచ్చింది. మూడు రోజుల్లో 100 కోట్ల క్లబ్బులో చేరిపోయింది. ఎండ్ ఆఫ్ ది డే ఆ సినిమా కలెక్షన్స్ దాదాపు 80 కోట్ల షేర్ వచ్చింది. అసలు ఆ సినిమా విడుదలైన రోజు ఇది బ్రేక్ ఈవెన్ కావడం కష్టమే అన్నారు. కాకపోతే కమర్షియల్ సినిమాకు స్టామినా అది. రొటీన్ కథ కథనాలు ఉన్నా కూడా ప్రేక్షకులు అలా కనెక్ట్ అయిపోతారు అంతే.
ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాకు మొదటి రోజే టాక్ బాగా వచ్చింది కానీ వీర సింహారెడ్డి సినిమాకు వచ్చిన కలెక్షన్స్ లో కనీసం సగం కూడా రాలేదు. మొదటి రోజు 16 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా.. రెండో రోజుకు ఐదు కోట్లకు పడిపోయింది. దసరా సీజన్ ఉంది కాబట్టి వారం రోజులు ఇదే రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పటివరకు సినిమాకు 50 కోట్ల షేర్ వచ్చింది. కానీ సినిమా సేఫ్ అవ్వాలంటే 80 కోట్లు రావాలి.
అదే అనిల్ రావిపూడి పరమ రొటీన్ సినిమాలు చేసిన ప్రతిసారి మంచి విజయం అందుకున్నాడు.. కానీ కెరీర్లో మొదటిసారి ఒక ప్రయోగం చేయాలి అనుకున్నాడు.. మంచి కథ చెప్పాలి అనుకున్నాడు.. దానికోసం బాలకృష్ణ లాంటి కమర్షియల్ హీరోనే ఎంచుకున్నాడు. అయితే వీళ్ళు చెప్పిన సోషల్ మెసేజ్ బాగానే రీచ్ అయింది. కానీ కమర్షియల్ గా సినిమా ఎంతవరకు సేఫ్ అవుతుంది.. ఇంత మంచి టాక్ వచ్చిన సినిమాకు లాభాలు ఏమి వస్తాయి అనేది అనేది మాత్రం అనుమానమే. అందుకే కమర్షియల్ హీరోలు ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ వెనకాడుతూనే ఉంటారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

