సమంత ప్రేమకథకు సంబంధం లేదు
కుటుంబ ప్రేమకథా చిత్రాలను జనరంజకంగా రూపొందించడంలో టాలీవుడ్లో తనదైన ముద్ర వేశారు దర్శకుడు శివ నిర్వాణ. నిన్నుకోరి, మజిలీ చిత్రాలతో ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు శివ నిర్వాణ. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఖుషి’.
కుటుంబ ప్రేమకథా చిత్రాలను జనరంజకంగా రూపొందించడంలో టాలీవుడ్లో తనదైన ముద్ర వేశారు దర్శకుడు శివ నిర్వాణ. నిన్నుకోరి, మజిలీ చిత్రాలతో ప్రేక్షకుల అభినందనలతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు శివ నిర్వాణ. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఖుషి’. విజయ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఈ చిత్రం సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు శివనిర్వాణ మంగళవారం పాత్రికేయులతో ముచ్చటించారు.
‘ఖుషి’ ఎలాంటి చిత్రం?
పెళ్లికి ముందు పెళ్లి తరువాత సమస్యలతో గతంలో అనేక సినిమాలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో టైటిల్‌కు తగినట్లుగా ఎంటర్టైన్మెంట్తో కథను చెప్పాలని అనుకున్నాను. ఈ చిత్ర కథాంశంలో ఒక యూనిక్ పాయింట్ ఉంది. నేటి సమాజంలో వున్న ఒక ఇష్యూను విజయ్, సమంత లాంటి పాపులర్ స్టార్స్ ద్వారా చెప్పిస్తే బాగుంటుందని నమ్మాను. నేను గతంలో తెరకెక్కించిన నిన్నుకోరి, మజిలీలో ఫెయిల్యూర్ లవ్‌స్టోరీస్ చూపించాను. కానీ ఈ సారి ఒక ఎంటర్టైనింగ్, ఎనర్జిటిక్, సరదాగా ఉండే ప్రేమకథను రూపొందించాలని అనుకున్నాను.
ఈ చిత్రం కోసం కశ్మీర్ నేపథ్యాన్ని ఎంచుకోవడానికి కారణం?
ఈ ప్రేమకథను ఎంత కొత్తగా చెప్పాలి అనే ఆలోచన నుంచి పుట్టిందే కశ్మీర్ బ్యాక్‌డ్రాప్. ఫస్టాఫ్‌లో లవ్‌స్టోరిని కాలేజీలో చూపించకుండా ఒక ఫీల్‌గుడ్ ప్లేస్, ప్లెజెంట్‌గా వుండే ప్లేస్ నుంచి మొదలుపెడితే బాగుంటుంది అనిపించింది. అందుకే కశ్మీర్ నేపథ్యాన్ని ఎంచుకున్నాను.
ఈ చిత్రంలో విజయ్ పాత్ర ఎలా ఉంటుంది?
విజయ్‌లో మంచి కామెడీ టైమింగ్ ఉంటుంది. పెళ్లిచూపులు, గీతగోవిందంలో ఒకలాంటి కామెడీ టైమింగ్ చూశారు. కానీ ఇందులో ైస్టెలిష్ కామెడీ చేశాడు. అమ్మాయిలకు, ఫ్యామిలీ ఆడియన్స్‌కు విజయ్ పాత్ర బాగా నచ్చుతుంది. అందరూ ఆయన పాత్రను ఓన్ చేసుకుంటారు.
సమంత పాత్ర కూడా డిఫరెంట్‌గా కనిపిస్తుంది?
ఈ చిత్రంలో వింటేజ్ సమంతను చూస్తారు. ఆమె తన కెరీర్లో అన్ని తరహా పాత్రలను, జానర్ చిత్రాలను చేసింది. ఇప్పుడు మళ్లీ లవ్‌స్టోరిలో సమంతను చూడటం మంచి ఫీల్ కలిగిస్తుంది.
సమంత రియల్‌లైఫ్‌కు ఈ కథకు ఏమైనా సంబంధం వుందా?
సమంత రియల్‌లైఫ్‌కు ఈ కథకు ఎలాంటి సంబంధం పోలిక లేదు. నేను మూడేళ్ల క్రితం రాసుకున్న కథ ఇది. ఆమెతో మజిలీ చిత్రం చేశాను కాబట్టి ఈ చిత్రంలో ఆరాధ్య పాత్రకు సరిపోతుందని, బాగా నటించగలదని తీసుకున్నాను. నేను రాసుకున్న కథలో పాత్రలో మాత్రమే ఆమె నటించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

