SK23 | సెట్స్ పైకి క్రేజీ కాంబో.. మురుగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ కొత్త సినిమా
AR Murugadoss | తమిళ స్టార్ దర్శకుడు మురుగుదాస్ (AR Murugadoss) గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన కెరియర్లో గజిని, తుపాకీ, కత్తి, స్టాలిన్ వంటి ఎన్నో అద్భుత చిత్రాలను తెరకెక్కించాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన గజిని, తుపాకీ, కత్తి లాంటి సినిమాలు అయితే కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి.
AR Murugadoss | తమిళ స్టార్ దర్శకుడు మురుగుదాస్ (AR Murugadoss) గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. తన కెరియర్లో గజిని, తుపాకీ, కత్తి, స్టాలిన్ వంటి ఎన్నో అద్భుత చిత్రాలను తెరకెక్కించాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన గజిని, తుపాకీ, కత్తి లాంటి సినిమాలు అయితే కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి. ఇక తెలుగులో చిరంజీవితో స్టాలిన్.. మహేష్ బాబుతో స్పైడర్ మూవీని తెరకెక్కించారు. హిందీలో కూడా మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ ఖాన్‌తో గజిన్ రీమేక్ చేశారు. ఇదిలా ఉంటే నేడు మురుగుదాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
పుట్టినరోజు సందర్భంగా మురుగదాస్ ను కలుసుకున్న కోలీవుడ్ నటుడు శివ కార్తికేయన్ (Siva Karthikeyan) ఆయనకు విషెస్ తెలిపాడు. అనంతరం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ SK 23 మురుగదాస్‌తో ఉంటుదని అనౌన్స్ చేశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలుపుతూ.. ”డియర్ మురుగదాస్ సర్.. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా 23వ ప్రాజెక్ట్ కోసం మీతో కలిసి వర్క్ చేయడం నాకెంతో సంతోషంగా ఉంది. మీరు చెప్పిన కథ విన్నాక నా ఆనందం రెట్టింపు అయ్యింది. అన్ని విధాలుగా ఈ సినిమా నాకు ప్రత్యేకం కానుంది. ఈ మూవీ షూటింగ్లో పాల్గొనేందుకు నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా” అంటూ శివ కార్తికేయన్ ట్వీట్ చేశారు.
Dear @ARMurugadoss sir,
Wishing you a very happy birthday sir 😊👍
Sir I’m extremely delighted to join with you for my 23rd film and I’m double delighted after listening to your narration. This film is going to be very special for me in all aspects and I can’t wait to start… pic.twitter.com/XiOye1GmuL
— Sivakarthikeyan (@Siva_Kartikeyan) September 25, 2023
ఇక రజనీకాంత్ దర్బార్ సినిమా డిజాస్టర్‌తో గ్యాప్ ఇచ్చిన మురుగదాస్ మళ్లీ మూడేళ్ల తర్వాత మెగాఫోన్ పట్టనున్నాడు. ఈ సినిమాను లైట్ హౌస్ మూవీస్ సంస్థ నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కనున్నట్లు సమాచారం. శివకార్తికేయన్, మురుగుదాస్ కాంబోలో రాబోతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

